గ్రౌండ్‌లోనే యువ క్రికెటర్ హఠాన్మరణం
కోల్‌కతాలో ఒక యువ క్రికెటర్ మైదానంలోనే ప్రాణాలు విడిచాడు. మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా యువ క్రికెటర్ కుప్పకూలిపడిపోయాడు. 21 ఏళ్ల అనికెత్ శర్మ… గతేడాదే క్రికెట్ క్లబ్లో చోటు సంపాదించుకున్నాడు. బుధవారం జరగాల్సిన మ్యాచ్ కోసం సహచరులతో కలిసి ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. గుండెపోటు వల్లే చనిపోయి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అనికేత్‌కు టీంలో ఆల్‌రౌండర్‌గా పేరుంది. బ్యాటింగ్‌తో పాటు ఫీల్టింగ్లోనూ అద్బుతమైన ప్రతిభ […]
కోల్‌కతాలో ఒక యువ క్రికెటర్ మైదానంలోనే ప్రాణాలు విడిచాడు. మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా యువ క్రికెటర్ కుప్పకూలిపడిపోయాడు. 21 ఏళ్ల అనికెత్ శర్మ… గతేడాదే క్రికెట్ క్లబ్లో చోటు సంపాదించుకున్నాడు.
బుధవారం జరగాల్సిన మ్యాచ్ కోసం సహచరులతో కలిసి ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. గుండెపోటు వల్లే చనిపోయి ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
అనికేత్‌కు టీంలో ఆల్‌రౌండర్‌గా పేరుంది. బ్యాటింగ్‌తో పాటు ఫీల్టింగ్లోనూ అద్బుతమైన ప్రతిభ చూపేవాడని టీం కోచ్ వివరించారు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తమ కళ్ల ముందే అనికేత్ కుప్పకూలిపడిపోయాడని చెప్పారు.
అనికేత్ మృతిని తాము జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అనికేత్ మృతి పట్ల బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అవిషేక్ దాల్మియా విచారం వ్యక్తం చేశారు. అనికేత్ మృతి కారణంగా బుధవారం జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు.