20 కోట్ల మార్క్ టచ్ చేసిన ఎఫ్2
వెంకీ, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. సంక్రాంతి బరిలో చివర్లో నిలిచినప్పటికీ వసూళ్ల పరంగా ఈ సినిమా అన్నింటికంటే ముందు ఉంది. మరీ ముఖ్యంగా విడుదలైన 4 రోజులకే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయల షేర్ సాధించడం విశేషం. విడుదలై వారం రోజులైనా కథానాయకుడు సినిమా ఈ ఘనత సాధించలేకపోయింది. ఎఫ్2 మాత్రం 4 రోజుల్లోనే అందుకుంది. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు మరిన్ని వసూళ్లు […]
వెంకీ, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. సంక్రాంతి బరిలో చివర్లో నిలిచినప్పటికీ వసూళ్ల పరంగా ఈ సినిమా అన్నింటికంటే ముందు ఉంది. మరీ ముఖ్యంగా విడుదలైన 4 రోజులకే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయల షేర్ సాధించడం విశేషం. విడుదలై వారం రోజులైనా కథానాయకుడు సినిమా ఈ ఘనత సాధించలేకపోయింది. ఎఫ్2 మాత్రం 4 రోజుల్లోనే అందుకుంది.
రాబోయే రోజుల్లో ఈ సినిమాకు మరిన్ని వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డిజాస్టర్ అయిన ఎన్టీఆర్-కథానాయకుడు స్థానంలో ఎఫ్2ను ప్రదర్శించేందుకు ఇప్పటికే ఎగ్జిబిటర్లు మొగ్గుచూపుతున్నారు. పైగా తొలి వారం రోజుల కోసమే అగ్రిమెంట్లు కుదర్చుకున్న థియేటర్లన్నీ రేపట్నుంచి ఖాళీ అవ్వబోతున్నాయి.
ఇవన్నీ చూసుకుంటే ఎఫ్2 సినిమా లాంగ్ రన్ లో 50 కోట్ల రూపాయల షేర్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. ఫైనల్ రన్ కింద ఓవర్సీస్ నుంచి ఈ సినిమాకు 2 మిలియన్ డాలర్లు అంచనా వేస్తున్నారు.