Telugu Global
NEWS

టికెట్ల విషయంలో చంద్రబాబు, జగన్‌ ఎందుకు వెనక్కు తగ్గారు?

ఎన్నికల నోటిఫికేషన్ మరో నెల, నెలన్నరలో విడుదలయ్యే అవకాశం ఉన్నా అభ్యర్థుల ప్రకటన విషయంలో రెండు పార్టీలు తొందరపడడం లేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను బేరీజు వేసుకున్న తర్వాత అభ్యర్థుల ప్రకటన ఇప్పుడే వద్దని వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు అధినేతల వద్ద విన్నవించుకుంటున్నారు. ఒక్కసారి అభ్యర్థులుగా పార్టీ ప్రకటించిన తర్వాత సహజంగానే వారి ఖర్చులు ఆమాంతం పెరిగిపోతాయి. అభ్యర్థిగా ప్రకటించిన క్షణం నుంచే అతడు బరిలో దిగాల్సి ఉంటుంది. ప్రచారానికి బయలుదేరి మందిమార్బలం […]

టికెట్ల విషయంలో చంద్రబాబు, జగన్‌ ఎందుకు వెనక్కు తగ్గారు?
X

ఎన్నికల నోటిఫికేషన్ మరో నెల, నెలన్నరలో విడుదలయ్యే అవకాశం ఉన్నా అభ్యర్థుల ప్రకటన విషయంలో రెండు పార్టీలు తొందరపడడం లేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను బేరీజు వేసుకున్న తర్వాత అభ్యర్థుల ప్రకటన ఇప్పుడే వద్దని వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు అధినేతల వద్ద విన్నవించుకుంటున్నారు. ఒక్కసారి అభ్యర్థులుగా పార్టీ ప్రకటించిన తర్వాత సహజంగానే వారి ఖర్చులు ఆమాంతం పెరిగిపోతాయి.

అభ్యర్థిగా ప్రకటించిన క్షణం నుంచే అతడు బరిలో దిగాల్సి ఉంటుంది. ప్రచారానికి బయలుదేరి మందిమార్బలం వెంట ఉంటుంది. వారి బాగోగులు చూసుకోవాల్సి ఉంటుంది. ఏదేని గ్రామానికి వెళ్తే అక్కడి ప్రజలు గుడి కట్టుకుంటామని అడిగితే భారీగా చందాలు ఇవ్వాల్సిందే. ఇవ్వలేను అని చెప్పడానికి వీలుండదు. అప్పుతెచ్చైనా సరే చందా ఇవ్వాల్సిందే. పెళ్లిలాంటి శుభకార్యాలు పెట్టుకుంటే చేతనైనంత సాయం చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో ప్రచారానికి ఖర్చు కింద స్థానిక నేతలు అడిగినంత సొమ్మును అభ్యర్థులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ముందే ప్రకటించడంతో వారు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల కంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులే ముందస్తు ఖర్చులు భారీగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒక్కో అభ్యర్థి రోజుకు 10లక్షల వరకు కొన్నిచోట్ల ఖర్చు చేయాల్సి వస్తుందని తెలంగాణ ఎన్నికలను చూసిన తర్వాత ఆంధ్రా నేతలు అదిరిపోతున్నారు. ఖర్చు భారం తగ్గించుకోవాలన్న ఒక కారణం వల్ల మరికొద్ది రోజుల పాటు అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చన్నది పార్టీ నేతలు చెబుతున్నారు.

First Published:  16 Jan 2019 6:06 AM IST
Next Story