మేం టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదు... కేవలం....
జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అంటే దాన్ని స్వాగతిస్తే తప్పేంటని ప్రశ్నించారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఫెడరల్ ఫ్రంట్ ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తుందని కేసీఆర్ చెప్పిన తర్వాత చర్చలు జరిపితే తప్పేంటి అని అంబటి నిలదీశారు. టీఆర్‌ఎస్‌తో వైసీపీ పొత్తు పెట్టుకోవడం లేదని… ఏపీలో టీఆర్‌ఎస్ ఒక్క సీటులో కూడా పోటీ చేయడం లేదన్నారు. అదే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌తో చంద్రబాబు పొత్తు కోసం […]
జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అంటే దాన్ని స్వాగతిస్తే తప్పేంటని ప్రశ్నించారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఫెడరల్ ఫ్రంట్ ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తుందని కేసీఆర్ చెప్పిన తర్వాత చర్చలు జరిపితే తప్పేంటి అని అంబటి నిలదీశారు. టీఆర్‌ఎస్‌తో వైసీపీ పొత్తు పెట్టుకోవడం లేదని… ఏపీలో టీఆర్‌ఎస్ ఒక్క సీటులో కూడా పోటీ చేయడం లేదన్నారు.
అదే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌తో చంద్రబాబు పొత్తు కోసం చర్చలు జరిపింది నిజం కాదా అని అంబటి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ఛీకొట్టిన తర్వాతే కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకోలేదా అని నిలదీశారు. పొత్తు కోసం టీఆర్‌ఎస్‌తో చంద్రబాబు చర్చలు జరిపితే తప్పు లేదు గానీ… జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ కోసం తాము చర్చలు జరిపితే తప్పా అని అంబటి నిలదీశారు.
లోటస్ పాండ్‌లో జగన్, కేటీఆర్ భేటీ జరుగుంటే టీవీ చానళ్లలో కుక్కల తరహాలో ఎందుకు మొరుగుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ చెడ్డవాడే అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అది కూడా హరికృష్ణ శవం వద్ద చంద్రబాబు కేటీఆర్‌తో ఎందుకు పొత్తు చర్చలు జరిపారని నిలదీశారు అంబటి. టీడీపీ, చంద్రబాబు దిగజారిపోయారనడానికి ఈ ప్రచారమే నిదర్శనమన్నారు.
ఏపీ ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా పోరాడే పార్టీ వైసీపీ అని అంబటి చెప్పారు. టీడీపీ నేతలు, పత్రికలు ఏం చెబితే అదే జరుగుతుందన్న భ్రమల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు పూర్తిగా విఫలమైపోయారన్నారు. చివరకు విజయవాడలో కనకదుర్గ ఫైఓవర్‌ను కూడా పూర్తి చేయలేని దుస్థితిలో చంద్రబాబు పాలన చేస్తున్నారన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నాక కూడా చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు.