కిడాంబీ శ్రీకాంత్ కు లీ నింగ్ బ్రాండ్ జాక్ పాట్
నాలుగేళ్లకు 35 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఆరు సూపర్ సిరీస్ టైటిల్స్ విజేత కిడాంబీ శ్రీకాంత్ ఏడాదికి 8 కోట్ల 50 లక్షల స్పాన్సర్ షిప్ మనీ అందుకోనున్న శ్రీకాంత్ తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ స్టార్ ప్లేయర్ కిడాంబీ శ్రీకాంత్ పంటపండింది. చైనా స్పోర్ట్స్ బ్రాండ్ లీ నింగ్ తో నాలుగేళ్లకు 35 కోట్ల రూపాయల కాంట్రాక్టు కుదుర్చుకొన్నాడు. తన కెరియర్ లో ఇప్పటికే ఆరు సూపర్ సిరీస్ టైటిల్స్ తో పాటు…కామన్వెల్త్ గేమ్స్ […]
- నాలుగేళ్లకు 35 కోట్ల రూపాయల కాంట్రాక్టు
- ఆరు సూపర్ సిరీస్ టైటిల్స్ విజేత కిడాంబీ శ్రీకాంత్
- ఏడాదికి 8 కోట్ల 50 లక్షల స్పాన్సర్ షిప్ మనీ అందుకోనున్న శ్రీకాంత్
తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ స్టార్ ప్లేయర్ కిడాంబీ శ్రీకాంత్ పంటపండింది. చైనా స్పోర్ట్స్ బ్రాండ్ లీ నింగ్ తో నాలుగేళ్లకు 35 కోట్ల రూపాయల కాంట్రాక్టు కుదుర్చుకొన్నాడు.
తన కెరియర్ లో ఇప్పటికే ఆరు సూపర్ సిరీస్ టైటిల్స్ తో పాటు…కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడల్ సాధించిన శ్రీకాంత్…వచ్చే నాలుగేళ్ళపాటు…ఏడాదికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయల చొప్పున వివిధ రూపాలలో స్పాన్సర్ షొప్ మనీ అందుకోనున్నాడు.
చైనా, ఇండోనీషియా, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల జట్లతో పాటు… ఇండోనేషియా వేదికగా గత ఏడాది ముగిసిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత ఒలింపిక్స్ జట్టుకు సైతం… లీ నింగ్ బ్రాండ్… అధికారిక స్పాన్సర్ గా వ్యవహరించింది.
2020 టోక్యో ఒలింపిక్స్ వరకూ భారత బ్యాడ్మింటన్, క్రికెట్ జట్లతో పాటు అథ్లెట్లకు సైతం లీ నింగ్ అధికారక బ్రాండ్ గా ఉండనుంది.
లీ నింగ్ లాంటి విశ్వవిఖ్యాత సంస్థకు, బ్రాండ్ కు …బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడం తన అదృష్టమని కిడాంబీ శ్రీకాంత్ పొంగిపోతున్నాడు.