Telugu Global
Cinema & Entertainment

ప్రొడ్యూసర్స్ ని ఇబ్బంది పెడుతున్న కైరా అద్వానీ

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చిన భామల్లో కైరా అద్వానీ ఒక హీరోయిన్. రావడం రావడమే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన “భరత్ అనే నేను” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది కైరా అద్వానీ. ఆ విజయం తరువాత ఈ భామ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా “వినయ విధేయ రామ” సినిమాలో నటించింది. ఈ సినిమా ప్లాప్ అయిన కూడా కైరా కి తెలుగు లో […]

ప్రొడ్యూసర్స్ ని ఇబ్బంది పెడుతున్న కైరా అద్వానీ
X

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చిన భామల్లో కైరా అద్వానీ ఒక హీరోయిన్. రావడం రావడమే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన “భరత్ అనే నేను” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది కైరా అద్వానీ. ఆ విజయం తరువాత ఈ భామ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా “వినయ విధేయ రామ” సినిమాలో నటించింది. ఈ సినిమా ప్లాప్ అయిన కూడా కైరా కి తెలుగు లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక డైరెక్టర్ సంపత్ నంది గోపీచంద్ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేద్దాం అని ప్లాన్ చేసాడు. ఇది వరకే వీళ్లిద్దరి కాంబినేషన్ లో “గౌతమ్ నంద” అనే సినిమా వచ్చింది.

ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ రెండో సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీ ని తీసుకోవాలి అనుకున్నాడు అంట సంపత్. కానీ సంపత్ నంది కి షాక్ ఇస్తూ అక్షరాలా కోటి యాబై లక్షల పారితోషకం డిమాండ్ చేసిందట కైరా అద్వానీ. అంత తిప్పి కొడితే మూడు సినిమాల ఎక్స్పీరియన్స్ కూడా లేని ఈ భామ ఎందుకు ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తుంది అనేది ఎవరికి మింగుడు పడటం లేదు. ఒకవేళ కైరా గాని ఇలాగే డిమాండ్ చేస్తే ఫ్యూచర్ లో నిర్మాతలు కైరా అద్వానీ దగ్గరకి వెళ్ళడానికి కూడా జంకుతారు.

First Published:  15 Jan 2019 5:53 AM IST
Next Story