నా కుమారుడు క్యాన్సర్‌ను జయించాడు- సినీ హీరో
బాలీవుడ్లో ఇటీవల పలువురు క్యాన్సర్ బారిన పడడం చాలా మందిని బాధిస్తోంది. సోనాలి, ఇర్ఫాన్ ఖాన్, హృతిక్ రోషన్ తండ్రి క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కుమారుడు కూడా కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారినపడ్డాడు. ఐదేళ్ల పాటు చికిత్స అందుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని ఇమ్రాన్ హష్మి ట్వీట్టర్లో తెలియజేశారు. తన కుమారుడు అయాన్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని వివరించారు. కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి […]
బాలీవుడ్లో ఇటీవల పలువురు క్యాన్సర్ బారిన పడడం చాలా మందిని బాధిస్తోంది. సోనాలి, ఇర్ఫాన్ ఖాన్, హృతిక్ రోషన్ తండ్రి క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కుమారుడు కూడా కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారినపడ్డాడు.
ఐదేళ్ల పాటు చికిత్స అందుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని ఇమ్రాన్ హష్మి ట్వీట్టర్లో తెలియజేశారు. తన కుమారుడు అయాన్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని వివరించారు.
కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. 2014లో అయాన్‌కు క్యాన్సర్ సోకినట్టు గుర్తించారు. ఐదేళ్ల పాటు నిరంతరాయంగా చికిత్స చేయించడంతో అయాన్ పూర్తిగా కోలుకున్నాడని ఇమ్రాన్ వెల్లడించారు. తన కుమారుడితో ఉన్న ఫోటోలను ట్వీట్ చేశారు. తన కుమారుడు క్యాన్సర్ బారి నుంచి పూర్తిగా బయటపడడం ఆనందంగా ఉందన్నారు.
Today, 5 years after his diagnosis Ayaan has been declared cancer free. It has been quite a journey. Thank you for all your prayers and wishes. Love and prayers for all the cancer fighters out there, hope and belief goes a long way. You can WIN this battle !!! #thekissoflife pic.twitter.com/sp3gySFjbS
— WHY Emraan Hashmi (@emraanhashmi) January 14, 2019