ఇంటిలోకి దూసుకెళ్లిన విమానం.. అమెరికా ఆంక్షలూ కారణమే!
ఇరాన్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. ఫైలట్ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. దశాబ్దాల క్రితం నాటి బోయింగ్ 707 కార్గో విమానం మాంసం తీసుకుని కిర్గిస్తాన్ నుంచి బయలుదేరింది. పాయం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ అత్యవసరంగా ఫత్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నట్టు పైలట్ ఎయిర్‌పోర్టు సిబ్బందికి సమాచారం అందించాడు. కానీ ల్యాండ్ అయ్యే సమయంలో విమానం అదుపు తప్పి కంచెను దాటుకుని … పక్కనే ఉన్న నివాసాల […]
ఇరాన్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. ఫైలట్ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. దశాబ్దాల క్రితం నాటి బోయింగ్ 707 కార్గో విమానం మాంసం తీసుకుని కిర్గిస్తాన్ నుంచి బయలుదేరింది.
పాయం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ అత్యవసరంగా ఫత్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నట్టు పైలట్ ఎయిర్‌పోర్టు సిబ్బందికి సమాచారం అందించాడు. కానీ ల్యాండ్ అయ్యే సమయంలో విమానం అదుపు తప్పి కంచెను దాటుకుని … పక్కనే ఉన్న నివాసాల వైపు దూసుకెళ్లింది. నేరుగా వెళ్లి ఒక ఇంట్లోకి చొచ్చుకుపోయింది.
ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దాంతో విమానంలో 14 మంది ఆర్మీ సిబ్బంది, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పాయంలో దిగాల్సిన విమానం పొరపాటున ఫత్‌లో దిగినట్లు ఓ ఏవియేషన్ అధికారి వెల్లడించింది. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా కొత్తగా విమానాలను ఆ దేశం కొనుగోలు చేయలేకపోతోంది. దీంతో దశాబ్దాల నాటి పాత విమానాలనే వాడుకుంటున్నారు. అందువల్లే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.