Telugu Global
Cinema & Entertainment

సినిమా ఫ్లాప్.. వసూళ్లు సూపర్ హిట్

సంక్రాంతికి ఉన్న గొప్పతనమే ఇది. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా మాస్ మూవీ అయితే చాలు వసూళ్లు కుమ్మేస్తాయి. గతేడాది అజ్ఞాతవాసి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు వినయ విధేయ రామ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అయింది. రామ్ చరణ్, బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. అయితేనేం వసూళ్లలో మాత్రం ఈ సినిమా భేష్ అనిపించుకుంటోంది. విడుదలైన ఈ 3 రోజుల్లో వినయ విధేయ రామ సినిమాకు ఏకంగా […]

సినిమా ఫ్లాప్.. వసూళ్లు సూపర్ హిట్
X

సంక్రాంతికి ఉన్న గొప్పతనమే ఇది. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా మాస్ మూవీ అయితే చాలు వసూళ్లు కుమ్మేస్తాయి. గతేడాది అజ్ఞాతవాసి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు వినయ విధేయ రామ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అయింది.

రామ్ చరణ్, బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. అయితేనేం వసూళ్లలో మాత్రం ఈ సినిమా భేష్ అనిపించుకుంటోంది. విడుదలైన ఈ 3 రోజుల్లో వినయ విధేయ రామ సినిమాకు ఏకంగా 21 కోట్ల రూపాయల షేర్ రావడం విశేషం. ఏపీ, నైజాంలో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 8.01 కోట్లు

సీడెడ్ – రూ. 9.90 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 3.24 కోట్లు

ఈస్ట్ – రూ. 2.51 కోట్లు

వెస్ట్ – రూ. 2.45 కోట్లు

గుంటూరు – రూ. 4.85 కోట్లు

కృష్ణా – రూ. 2.20 కోట్లు

నెల్లూరు – రూ. 1.98 కోట్లు

First Published:  14 Jan 2019 12:52 PM IST
Next Story