ట్రంప్‌ను ఓడిస్తానంటున్న తులసీ
2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అప్పుడే హడావుడి మొదలవుతోంది. ట్రంప్‌ను ఓడించేందుకు డెమోక్రటిక్ పార్టీ నుంచి పలువురు సై అంటున్నారు. ఇప్పటికే అధ్యక్ష రేసులో ఉన్నానని సెనెటర్ ఎలిజబెత్ వార్రెన్ ప్రకటించారు. తాజాగా డెమోక్రటిక్ పార్టీ నుంచి మరో మహిళ తాను కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు వెల్లడించారు. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందువుగా రికార్డు నెలకొల్పిన తులసీ గబార్డ్ రేసులో నిలవబోతున్నారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో పోటీ […]
2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అప్పుడే హడావుడి మొదలవుతోంది. ట్రంప్‌ను ఓడించేందుకు డెమోక్రటిక్ పార్టీ నుంచి పలువురు సై అంటున్నారు. ఇప్పటికే అధ్యక్ష రేసులో ఉన్నానని సెనెటర్ ఎలిజబెత్ వార్రెన్ ప్రకటించారు.
తాజాగా డెమోక్రటిక్ పార్టీ నుంచి మరో మహిళ తాను కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు వెల్లడించారు. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందువుగా రికార్డు నెలకొల్పిన తులసీ గబార్డ్ రేసులో నిలవబోతున్నారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో పోటీ పడుతున్న వారి సంఖ్య రెండుకు చేరింది. తులసీ నాలుగుసార్లు డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
తులసీనే కాకుండా భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హ్యారిస్ కూడా అధ్యక్ష రేసులో పోటీ పడతారని అంచనా. తులసీ పోటీ చేస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే తొలి హిందూ మహిళ అవుతారు.
ఒకవేళ పోటీ చేసి గెలిస్తే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు నెలకొల్పుతారు. వచ్చే నెల 3న ఐయోవా ప్రైమరీ ఎన్నికలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. రిపబ్లిక్ పార్టీ నుంచి ట్రంపే మరోసారి పోటీ చేయనున్నారు.