Telugu Global
NEWS

ఇండియన్ క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ రాహుల్ ద్రావిడ్

జిడ్డాటలో ఆదిగురువు రాహుల్ ద్రావిడ్ 46వ పడిలో టీమిండియా క్రికెట్ వాల్ గంటల తరబడి బ్యాటింగ్ లో తనకు తానే సాటి ప్రపంచ క్రికెట్ కు భారత్ అందించిన అసాధారణ ఆటగాళ్లలో… ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ ముందు వరుసలో ఉంటాడు. భారత క్రికెటర్ గా తన 15 ఏళ్ల కెరియర్ లో ఎన్నో అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన మొనగాడు ద్రావిడ్. జనవరి 11న జన్మించిన రాహుల్ శరత్ ద్రావిడ్…46వ పడిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా ఇండియన్ క్రికెట్ […]

ఇండియన్ క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ రాహుల్ ద్రావిడ్
X
  • జిడ్డాటలో ఆదిగురువు రాహుల్ ద్రావిడ్
  • 46వ పడిలో టీమిండియా క్రికెట్ వాల్
  • గంటల తరబడి బ్యాటింగ్ లో తనకు తానే సాటి

ప్రపంచ క్రికెట్ కు భారత్ అందించిన అసాధారణ ఆటగాళ్లలో… ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ ముందు వరుసలో ఉంటాడు.

భారత క్రికెటర్ గా తన 15 ఏళ్ల కెరియర్ లో ఎన్నో అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన మొనగాడు ద్రావిడ్.

జనవరి 11న జన్మించిన రాహుల్ శరత్ ద్రావిడ్…46వ పడిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా ఇండియన్ క్రికెట్ వాల్ కమాల్ ఏంటో ఓసారి గుర్తు చేసుకొందాం…

డిఫెన్సే ఆయుధంగా….

ఎదురుదాడితో బౌలర్లను చెండాటం ఓ రకమైన బ్యాటింగ్ స్టయిల్ అయితే…. దానికి భిన్నమైన ఆటతీరుతో ద్రావిడ్ గొప్ప క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. క్రీజులోకి వచ్చాడంటే చాలు… ఫెవికాల్ అంటించుకొని వచ్చినట్లుగా క్రీజుకే అతుక్కుపోయే ఆటగాడు రాహుల్ ద్రావిడ్.

ప్రత్యర్థి జట్ల బౌలర్లను తన జిడ్డాటతో…. విసిగించి, వేధించి భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఘనత ద్రావిడ్ కు మాత్రమే దక్కుతుంది.

కర్నాటక నుంచి భారత క్రికెట్ లోకి దూసుకొచ్చి…. ఇండియన్ క్రికెట్ వాల్ గా పలు అరుదైన రికార్డులు సాధించిన ద్రావిడ్… ప్రస్తుతం రిటైర్మెంట్ జీవితాన్ని జూనియర్ ఇండియా కోచ్ గా ఆస్వాధిస్తున్నాడు.

రిషభ్ పంత్, హనుమ విహారీ, పృథ్వీ షా, సంజు శాంసన్ లాంటి ఎందరో ప్రతిభావంతులైన నవతరం క్రికెటర్లను భారత సీనియర్ జట్టుకు అందించిన ఘనత కేవలం ద్రావిడ్ కు మాత్రమే సొంతం.

164 టెస్టుల్లో 36 శతకాలు….

ద్రావిడ్ తన టెస్ట్ కెరియర్ లో ఏకంగా 164 టెస్టులు ఆడి…36 శతకాలు బాదాడు. 13 వేల 288 పరుగులతో 52.31 సగటు నమోదు చేశాడు. అంతేకాదు… సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంలో… తనకు తానే సాటిగా నిలిచిన ద్రావిడ్… కెరియర్ లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్ ను ఓసారి చూద్దాం..

పాక్ పై 12 గంటల 20 నిముషాల బ్యాటింగ్…

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో 2004 సిరీస్ లో భాగంగా రావల్పిండి వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ తొలిఇన్నింగ్స్ లో రాహుల్ ద్రావిడ్ 270 పరుగుల స్కోరు సాధించాడు. మొత్తం 740 నిముషాలపాటు…. పాక్ బౌలింగ్ ఎటాక్ ను నిలువరించి… వారేవ్వా అనిపించుకొన్నాడు.

గంట కాదు…రెండు గంటలు కాదు…ఏకంగా 12 గంటల 20 నిముషాలపాటు ఆడి…ఇండియన్ క్రికెట్ వాలా…కమాలా అనిపించుకొన్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 131 పరుగుల విజయంతో చరిత్ర సృష్టించింది.

ఇంగ్లండ్ పై 10 గంటల 30 నిముషాల బ్యాటింగ్…

స్వింగ్, సీమ్ బౌలింగ్ కు అనువుగా ఉండే లండన్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో…రాహుల్ ద్రావడ్ 10 గంటల 30నిముషాలపాటు ఆడి 217 పరుగుల స్కోరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

మొత్తం 468 బాల్స్ ఎదుర్కొని…భారత్ 515 పరుగుల భారీ స్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించాడు.

అడిలైడ్ ఓవల్ లో 9 గంటల 54 నిముషాల పోరాటం…

2003 సిరీస్ లో భాగంగా…అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో రాహుల్ ద్రావిడ్…446 బాల్స్ ఎదుర్కొని 233 పరుగుల స్కోరు సాధించాడు.

594 నిముషాల పాటు… కంగారూ బౌలర్లను ఎదుర్కొని తనకుతానే సాటిగా నిలిచాడు. 9 గంటల 54 నిముషాల పాటు క్రీజులో నిలవడం ద్వారా… దటీజ్ ద్రావిడ్ అని చాటుకొన్నాడు. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదో అసాధారణ ఇన్నింగ్స్ గా, అపూర్వ బ్యాటింగ్ షోగా నిలిచిపోతుంది.

జోహెన్స్ బర్గ్ లో వాల్…వారేవ్వా…

ఫాస్ట్ బౌలర్ల స్వర్గం జోహెన్స్ బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో ద్రావిడ్ 9 గంటల 1 నిముషంపాటు బ్యాటింగ్ కొనసాగించాడు. 362 బాల్స్ ఎదుర్కొని 148 పరుగుల స్కోరు సాధించాడు.

సఫారీ మెరుపు ఫాస్ట్ బౌలర్లు అలన్ డోనాల్డ్, షాన్ పోలాక్ లను అలవోకగా ఎదుర్కొని…మ్యాచ్ డ్రాగా ముగియడంలో ప్రధానపాత్ర వహించాడు. ద్రావిడ్ కెరియర్ లో ఇదే మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ గా గుర్తింపు తెచ్చుకొంది.

ఇంగ్లండ్ పై 96 బాల్స్ లో 12 పరుగులు….

క్లిష్టపరిస్థితుల్లో…బ్యాటింగ్ కు అనువుగాని సమయంలో…ప్రత్యర్థి బౌలర్లు వీరవిహారం చేస్తున్న తరుణంలో…ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఏకాగ్రతతో బ్యాటింగ్ చేయాలో… రాహుల్ ద్రావిడ్ కు మాత్రమే తెలుసు.

ఇంగ్లండ్ తో లండన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ లో ద్రావిడ్ 96 బాల్స్ ఎదుర్కొని 12 పరుగుల స్కోరు సాధించాడు. టెస్ట్ క్రికెట్లో ఇదే అసాధారణ నత్తనడక ఇన్నింగ్స్ గా రికార్డుల్లో చేరింది.

రాహుల్ ద్రావిడ్ లాంటి అసాధారణ ఆటగాడి వారసుడుగా ప్రస్తుతం నయావాల్ చతేశ్వర్ పూజారా…టీమిండియాకు ప్రస్తుతం కొండంత అండగా నిలుస్తూ వస్తున్నాడు.

ఆస్ట్రేలియాతో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయంలో…పూజారా ప్రధానపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 7 టెస్ట్ ఇన్నింగ్స్ లో 3 సెంచరీలతో పాటు అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా పూజారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ క్రికెట్ వాల్….
రాహుల్ ద్రావిడ్ గర్వించేలా చేశాడు.

First Published:  13 Jan 2019 7:04 AM IST
Next Story