Telugu Global
NEWS

సంక్రాంతి ఎఫెక్ట్‌.... స్తంభించిన హైవేలు.... మూడు రెట్లు వాహనాలు

సంక్రాంతికి సొంతూరు వెళ్లేందుకు బయలుదేరిన జనం రహదారులపైనే నరకం చూస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే అన్ని దారులు స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. టోల్‌ ప్లాజాల వద్ద పరిస్థితి దయనీయంగా ఉంది. విజయవాడ హైవే పైకి వేలాది వాహనాలు రావడంతో ముందుకు కదలలేని పరిస్థితి. దాదాపు వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. రైళ్లు, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలా మంది కార్లలో సొంతూర్లకు బయలు దేరారు. దీంతో అసాధారణ రీతిలో వాహనాలు రోడ్లపై […]

సంక్రాంతి ఎఫెక్ట్‌.... స్తంభించిన హైవేలు.... మూడు రెట్లు వాహనాలు
X

సంక్రాంతికి సొంతూరు వెళ్లేందుకు బయలుదేరిన జనం రహదారులపైనే నరకం చూస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే అన్ని దారులు స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. టోల్‌ ప్లాజాల వద్ద పరిస్థితి దయనీయంగా ఉంది.

విజయవాడ హైవే పైకి వేలాది వాహనాలు రావడంతో ముందుకు కదలలేని పరిస్థితి. దాదాపు వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. రైళ్లు, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలా మంది కార్లలో సొంతూర్లకు బయలు దేరారు. దీంతో అసాధారణ రీతిలో వాహనాలు రోడ్లపై నిలిచిపోతున్నాయి. కొందరు వెనక్కు వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కావడం లేదు.

ముందుకే కాకుండా వెనక్కు కూడా వెళ్లలేని పరిస్థితి. వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రావడం, ఆంధ్రా ప్రాంతంలో సంక్రాంతిని ఘనంగా నిర్వహించుకునే అనవాయితీ ఉండడంతో అటువైపు వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. పండుగ సందర్భంగా ఆంధ్రా, తెలంగాణ ఆర్టీసీలు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నా రద్దీని తట్టుకోలేకపోతున్నాయి.

టోల్‌ప్లాజాల వల్లే ప్రయాణం చాలా ఆలస్యం అవుతోంది… టోల్‌ప్లాజాల వద్ద ఆలస్యం కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ పూట టోల్‌ ప్లాజాను ఎత్తివేయాలని కోరుతున్నారు.

ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వైపు సాధారణ సమయంలో రోజుకు 12 వేల వరకు వాహనాలు వెళ్తుంటాయని… పండుగ పూట మాత్రం 34వేలకు పైగా వాహనాలు ఎల్బీ నగర్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లాయని ట్రాఫిక్ డీసీపీ వివరించారు.

పంతంగి టోల్‌ వద్ద ఒక్కో వాహనం వద్ద ఫీజు వసూలు చేయడానికి ఎక్కువ సమయం పడుతోందని… దీని వల్ల ఆలస్యం అవుతోందని వివరించారు. టోల్‌ప్లాజాల వద్ద వాహనాల వద్దకే వచ్చి ఫీజు వసూలు చేసుకుంటే ఆలస్యం ఉండదన్న ఉద్దేశంతో టోల్ సిబ్బందితో మాట్లాడుతున్నామని ట్రాఫిక్ డీసీపీ వివరించారు.

First Published:  12 Jan 2019 1:44 AM GMT
Next Story