Telugu Global
NEWS

సిడ్నీ వన్డేలో టీమిండియాకు కంగారూ దెబ్బ

టీమిండియాకు 34 పరుగుల పరాజయం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 288 టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 254 రోహిత్ సెంచరీ, ధోనీ హాఫ్ సెంచరీలు వృథా ఆస్ట్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్ ను…రెండోర్యాంకర్ టీమిండియా ఓటమితో ప్రారంభించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా ముగిసిన పోటీలో ఆతిథ్య ఆస్ట్రేలియా …. 34 పరుగులతో టీమిండియాను కంగు తినిపించి..1-0 ఆధిక్యత సంపాదించింది. ఈ మ్యాచ్ లో ముందుగా కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న కంగారూ […]

సిడ్నీ వన్డేలో టీమిండియాకు కంగారూ దెబ్బ
X
  • టీమిండియాకు 34 పరుగుల పరాజయం
  • ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 288
  • టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 254
  • రోహిత్ సెంచరీ, ధోనీ హాఫ్ సెంచరీలు వృథా

ఆస్ట్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్ ను…రెండోర్యాంకర్ టీమిండియా ఓటమితో ప్రారంభించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా ముగిసిన పోటీలో ఆతిథ్య ఆస్ట్రేలియా …. 34 పరుగులతో టీమిండియాను కంగు తినిపించి..1-0 ఆధిక్యత సంపాదించింది.

ఈ మ్యాచ్ లో ముందుగా కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న కంగారూ టీమ్…50 ఓవర్లలో 5 వికెట్లకు 288 పరుగులు సాధించింది.

వన్ డౌన్ క్వాజా, రెండో డౌన్ షాన్ మార్ష్, మూడో డౌన్ ఆటగాడు హాండ్స్ కోంబ్ హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా తమజట్టుకు మ్యాచ్ విన్నింగ్ స్కోరు అందించారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

సమాధానంగా 289 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా ఒకదశలో 4 పరుగులకే ఓపెనర్ శిఖర్ ధావన్, వన్ డౌన్ విరాట్ కొహ్లీ, రెండో డౌన్ అంబటి రాయుడు వికెట్లు కోల్పోయి ఎదురీత ప్రారంభించింది.

రోహిత్ శర్మ, ధోనీ…4వ వికెట్ కు 137 పరుగుల భాగస్వామ్యంతో పరిస్థితి చక్కదిద్దినా…ఓటమి తప్పలేదు.

రోహిత్ శర్మ 133, ధోనీ 51 పరుగులు మినహా మిగిలిన టాపార్డర్ ఆటగాళ్లు తేలిపోయారు. సిరీస్ లోని రెండో వన్డే ఈనెల 15న అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతుంది.

First Published:  12 Jan 2019 5:21 AM GMT
Next Story