నా ప్రొడక్షన్ హౌస్ లో నాన్న మాత్రమే హీరో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక వైపు హీరోగా పెద్ద బడ్జెట్ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు కొణిదెల ప్రొడక్షన్స్ పై భారీ బడ్జెట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవినీ హీరోగా పెట్టి “ఖైది నెంబర్ 150” సినిమాని ప్రొడ్యూస్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు మళ్ళి తన నాన్న చిరంజీవితోనే “సై రా నరసింహారెడ్డి” వంటి సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక వైపు హీరోగా పెద్ద బడ్జెట్ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు కొణిదెల ప్రొడక్షన్స్ పై భారీ బడ్జెట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవినీ హీరోగా పెట్టి “ఖైది నెంబర్ 150” సినిమాని ప్రొడ్యూస్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు మళ్ళి తన నాన్న చిరంజీవితోనే “సై రా నరసింహారెడ్డి” వంటి సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతుంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా తరువాత కొణిదెల ప్రొడక్షన్స్ పై కొత్త వాళ్ళని పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేస్తారా అని రామ్ చరణ్ ని అడిగితే, లేదు ఈ బ్యానర్ లో కేవలం నాన్నని హీరోగా పెట్టి మాత్రమే సినిమాలు చేస్తాను. ఇది నాన్న కోసమే మాత్రమే స్థాపించిన బ్యానర్ అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. మెగా స్టార్ తదుపరి సినిమాలని త్రివిక్రమ్ ఇంకా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలని కూడా కొణిదెల ప్రొడక్షన్స్ పైనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు రామ్ చరణ్.