జగన్ కేసుపై మోడీకి చంద్రబాబు ఘాటు లేఖ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు … ప్రధాని మోడీకి ఘాటు లేఖ రాశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని లేఖలో తీవ్రంగా తప్పుపట్టారు. కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం ద్వారా సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడిచారంటూ… ఐదు పేజీల లేఖలో చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం ద్వారా ఎన్‌ఐఏ చట్టాన్ని దుర్వినియోగం చేశారని చంద్రబాబు ఆరోపించారు. సంక్లిష్టమైన, దేశ భద్రతకు […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు … ప్రధాని మోడీకి ఘాటు లేఖ రాశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని లేఖలో తీవ్రంగా తప్పుపట్టారు.
కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం ద్వారా సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడిచారంటూ… ఐదు పేజీల లేఖలో చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం ద్వారా ఎన్‌ఐఏ చట్టాన్ని దుర్వినియోగం చేశారని చంద్రబాబు ఆరోపించారు.
సంక్లిష్టమైన, దేశ భద్రతకు సంబంధించిన, అంతర్జాతీయ, జాతీయ కేసులను మాత్రమే ఎన్‌ఐఏకు అప్పగించాలని… జగన్‌పై దాడి లాంటి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడం సరైనది కాదని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చంద్రబాబు లేఖలో వెల్లడించారు. 2008 ఎన్‌ఐఏ యాక్ట్ ఏం చెబుతోందో చూసుకోవాలన్నారు.