హోంమంత్రికే సరిగా తెలియవు
తన అనుచరుల ఇళ్లపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ మంత్రి భూమా అఖిలప్రియ గన్‌మెన్లను తిరస్కరించడంపై ఇటీవల స్పందించిన హోంమంత్రి చినరాజప్ప… అఖిలప్రియ చాలా విషయాలు తెలుసుకోవాలని హితవు పలికారు. గన్‌మెన్లను తిరిస్కరించడం సరైన పద్దతి కాదని… ఏదైనా సమస్య ఉంటే పెద్దలతో మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియ స్పందించారు. తాను, తన చెల్లి ఇద్దరం జనసేనలోకి వెళ్తామంటూ ప్రచారం చేస్తున్నారని…అలా తామెందుకు టీడీపీని వదిలి వెళ్తామని ప్రశ్నించారు. టీడీపీలోకి వచ్చిన తర్వాతే తనకంటూ […]
తన అనుచరుల ఇళ్లపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ మంత్రి భూమా అఖిలప్రియ గన్‌మెన్లను తిరస్కరించడంపై ఇటీవల స్పందించిన హోంమంత్రి చినరాజప్ప… అఖిలప్రియ చాలా విషయాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
గన్‌మెన్లను తిరిస్కరించడం సరైన పద్దతి కాదని… ఏదైనా సమస్య ఉంటే పెద్దలతో మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియ స్పందించారు.
తాను, తన చెల్లి ఇద్దరం జనసేనలోకి వెళ్తామంటూ ప్రచారం చేస్తున్నారని…అలా తామెందుకు టీడీపీని వదిలి వెళ్తామని ప్రశ్నించారు. టీడీపీలోకి వచ్చిన తర్వాతే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పారామె.
కర్నూలు జిల్లా రుద్రవరంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. అక్కడే విలేకర్లతో చిట్‌చాట్ నిర్వహించారు. తాను ఒక సమస్యపై పోరాటం చేస్తుంటే… ప్రచారం మాత్రం మరోలా జరుగుతోందని ఆవేదన చెందారు.
తాను చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదన్నారు. జిల్లాకు ఎస్పీగా ఎవరొచ్చినా… ఎవరో చెప్పే మాటలు విని ఆళ్లగడ్డను వేరే దృష్టితో చూస్తున్నారని మంత్రి విమర్శించారు. ఆళ్లగడ్డలో ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉన్న మాట వాస్తవమేనని… కానీ ఇప్పుడు అంతా ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నారని వివరించారు.
మార్పు వచ్చిన తర్వాత కూడా వ్యక్తులను పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి అవమానిస్తే మార్పు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. హోంమంత్రి చినరాజప్ప చేసిన హితబోధను ప్రస్తావించగా… హోంమంత్రి చిన్నరాజప్పకు ఆళ్లగడ్డ విషయాలు సరిగా తెలియవని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఆళ్లగడ్డ గురించి హోంమంత్రి వాస్తవాలు తెలుసుకోవాలని అఖిలప్రియ ఆశించారు.