Telugu Global
National

కాంగ్రెస్ తో పొత్తు ఉపయోగం లేదు....

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలను ప్రభావితం చేసే పొత్తు కుదిరింది. ఎస్పీ, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరినట్టు అధికారికంగా అఖిలేశ్‌ యాదవ్, మాయావతి ప్రకటించారు. ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు చెరి సగం స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఎస్పీ 38 స్థానాల్లో, బీఎస్పీ 38 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సోనియా, రాహుల్‌ పోటీ చేసే అమేథి, రాయ్‌బరేలి నియోజకవర్గాలను కాంగ్రెస్‌కు వదిలేశారు. ఆర్‌ఎల్‌డీకి రెండు లోక్‌సభ […]

కాంగ్రెస్ తో పొత్తు ఉపయోగం లేదు....
X

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలను ప్రభావితం చేసే పొత్తు కుదిరింది. ఎస్పీ, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరినట్టు అధికారికంగా అఖిలేశ్‌ యాదవ్, మాయావతి ప్రకటించారు. ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు చెరి సగం స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఎస్పీ 38 స్థానాల్లో, బీఎస్పీ 38 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సోనియా, రాహుల్‌ పోటీ చేసే అమేథి, రాయ్‌బరేలి నియోజకవర్గాలను కాంగ్రెస్‌కు వదిలేశారు. ఆర్‌ఎల్‌డీకి రెండు లోక్‌సభ స్థానాలను విడిచిపెట్టారు.

యూపీలో కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చించలేదన్నారు అఖిలేశ్‌. యూపీలో కాంగ్రెస్‌కు బలం లేదని వ్యాఖ్యానించారు. పొత్తుకు అంగీకరించిన మాయవతికి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మోడీ, అమిత్ షాలు నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుందని మాయావతి వ్యాఖ్యానించారు.

యూపీ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ, మైనార్టీల ప్రయోజనాల కోసమే తాము పొత్తు పెట్టుకున్నట్టు వివరించారామె. ఎస్పీ-బీఎస్పీ గతంలోనూ పొత్తు పెట్టుకున్నట్టు ఆమె గుర్తు చేశారు.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ ఓటింగ్‌ తమకు బదిలీ కాదన్న విషయం గతంలోనే అర్థమైందన్నారు. మోడీకి వ్యతిరేకంగా తమ కూటమి పనిచేస్తుందన్నారు.

First Published:  12 Jan 2019 10:47 AM IST
Next Story