బాలకృష్ణకు నాగబాబు ఫైనల్ వార్నింగ్ ఇలా ఇచ్చారు....
చాలా మంది…. నాగబాబు ఇన్ని రోజుల తర్వాత బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నిస్తున్నారని… కానీ ఇంతకాలం భరించాం… ఇప్పుడు ఒళ్లు మండి మాట్లాడుతున్నామని చెప్పారు మెగా బ్రదర్ నాగబాబు. ఏడాది తర్వాత కూడా తాను మాట్లాడుతానని అందులో తప్పేముందని ప్రశ్నించారు. తమ గురించి మాట్లాడిన వ్యక్తులకు ఏడాది తర్వాతైనా, ఎప్పుడైనా కౌంటర్ ఇస్తామన్నారు. దొంగతనం చేసిన వాడు ఏడాది తర్వాత దొరికితే చర్యలు తీసుకోకుండా ఉంటామా అని ప్రశ్నించారు. 2012లో బాలకృష్ణ ఒక డ్యామేజింగ్ స్టేట్‌మెంట్ […]

చాలా మంది…. నాగబాబు ఇన్ని రోజుల తర్వాత బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నిస్తున్నారని… కానీ ఇంతకాలం భరించాం… ఇప్పుడు ఒళ్లు మండి మాట్లాడుతున్నామని చెప్పారు మెగా బ్రదర్ నాగబాబు.
ఏడాది తర్వాత కూడా తాను మాట్లాడుతానని అందులో తప్పేముందని ప్రశ్నించారు. తమ గురించి మాట్లాడిన వ్యక్తులకు ఏడాది తర్వాతైనా, ఎప్పుడైనా కౌంటర్ ఇస్తామన్నారు.
దొంగతనం చేసిన వాడు ఏడాది తర్వాత దొరికితే చర్యలు తీసుకోకుండా ఉంటామా అని ప్రశ్నించారు. 2012లో బాలకృష్ణ ఒక డ్యామేజింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. ఒక ప్రముఖ పత్రికలో ఆ విషయం ప్రచురితమైందన్నారు.
చిరంజీవి ఎన్టీఆర్ కాలి గోటికి కూడా సరిపోడని 2012లో బాలకృష్ణ చెప్పారన్నారు. తాను రియాక్ట్ అవుదామనుకునే లోపే తన అన్న చిరంజీవి స్పందించి… బాలకృష్ణ చిన్నపిల్లాడి లాంటి వాడు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారని గుర్తు చేశారు నాగబాబు.
బాలకృష్ణకు ఆయన తండ్రి గొప్పగా కనిపించడంలో తప్పులేదన్నారు. కానీ ఆయన తండ్రి కాలిగోటికి చిరంజీవి సరిపోడు అనడం సరైనది కాదన్నారు. చిరంజీవి కాలి గోటికి బాలకృష్ణ సరిపోడని తాను అంటే బాలకృష్ణకు, ఆయన అభిమానులకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిందిగా మర్యాదగానే బాలకృష్ణకు చెబుతున్నామన్నారు. తన సోదరులను ఎవరన్నా ఏమైనా అంటే తాను తప్పకుండా రియాక్ట్ అవుతానని స్పష్టం చేశారు.
రాజకీయంగా పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే అభ్యంతరం లేదు గానీ… వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం సహించబోమన్నారు. తాను చెప్పాల్సింది చెప్పానని… ఇకపై బాలకృష్ణ మౌనంగా ఉంటే బాగుంటుందని… లేకుంటే తాను స్పందిస్తూనే ఉంటానన్నారు. సినీ పరిశ్రమను గులాంగా భావించవద్దని హెచ్చరించారు నాగబాబు. బాలకృష్ణ విషయాన్ని తాను ఇంతటితో వదిలేస్తున్నానని చెప్పారు.