హోటల్స్ సరిపోవనే నేను పిలుపునివ్వడం లేదు....
నిజమైన లౌకికవాద ప్రభుత్వం రావాలంటే ప్రజాశాంతి పార్టీకి ఓటేయాలని కోరారు కేఏ పాల్. తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల ఓటర్లు ఉన్నారని… వీరంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు. ఇప్పటికే కోటి నాలుగు లక్షల మంది ప్రజాశాంతి పార్టీలో చేరారన్నారు. వెబ్‌సైట్ ద్వారా పార్టీలో చేరాలని కోరారు. వెయ్యి మందిని పార్టీలో చేర్పిస్తే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాగానే జూన్ ఒకటి నుంచి మూడువేల రూపాయల స్టైఫండ్ ఇస్తామన్నారు. అక్టోబర్ నుంచి శాశ్వాత ఉద్యోగం ఇప్పిస్తానని హామీ […]
నిజమైన లౌకికవాద ప్రభుత్వం రావాలంటే ప్రజాశాంతి పార్టీకి ఓటేయాలని కోరారు కేఏ పాల్. తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల ఓటర్లు ఉన్నారని… వీరంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు. ఇప్పటికే కోటి నాలుగు లక్షల మంది ప్రజాశాంతి పార్టీలో చేరారన్నారు.
వెబ్‌సైట్ ద్వారా పార్టీలో చేరాలని కోరారు. వెయ్యి మందిని పార్టీలో చేర్పిస్తే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాగానే జూన్ ఒకటి నుంచి మూడువేల రూపాయల స్టైఫండ్ ఇస్తామన్నారు. అక్టోబర్ నుంచి శాశ్వాత ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
ప్రపంచంలో తనకున్న విశ్వసనీయత ఎవరికీ లేదన్నారు. తాను మాట ఇస్తే తప్పే పరిస్థితే ఉండదన్నారు. పార్టీలో చేరాలంటే కేవలం పది రూపాయల ఫీజు చెల్లిస్తే సరిపోతుందన్నారు. తాను పిలిస్తే ప్రపంచ దేశాల అధ్యక్షులంతా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. కానీ వారంతా వస్తే హైదరాబాద్‌లో హోటల్స్ సరిపోవన్న ఉద్దేశంతోనే తాను పిలుపునివ్వడం లేదన్నారు.
ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఐదేళ్లలో విజయవాడను హైదరాబాద్‌ను మించిపోయేలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో కనీసం 20 ఎంపీలనైనా ప్రజాశాంతి పార్టీ నుంచి గెలిపించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు అవసరం లేదన్నారు.
తనను గెలిపిస్తే నియోజవకర్గానికి వంద కోట్లు తానే ఫండ్ ఇస్తానన్నారు. తెలుగు రాష్ట్రాల అప్పు మొత్తం ఐదేళ్లలో తీర్చేస్తానన్నారు. తాను ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తే ఏడు లక్షల కోట్లు వెంటనే వచ్చేస్తాయని… దాన్ని చేసి చూపిస్తానని ప్రకటించారు.
నీకు ఫ్యామిలీ లేదు… నాకు ఫ్యామిలీ లేదు ఇద్దరం కలిసి దేశాన్ని బాగు చేద్దామని గంటన్నర పాటు మోడీ బతిమలాడుకోవడం వల్లే తాను 2014 ఎన్నికల్లో పోటీ చేయలేకపోయానని పాల్ చెప్పారు.