ఆయన ఎందుకు విడాకులు తీసుకోబోతున్నాడు?
జెఫ్ బెజోస్…ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అంతేకాదు అమెజాన్ ఫౌండర్ కూడా. తన 25ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యాడు. భార్య మెంకజీ బెజోస్ కు విడాకులు ఇవ్వబోతున్నాడన్న వార్త చర్చనీయాంశంగా మారింది. బెజోస్ విడాకుల అంశం కంపెనీపై, షేర్లపై ఎలాంటి ప్రభావం చూపక పోయినప్పటికీ…. వారి మధ్య విభేదాలు తలెత్తడానికి గల కారణం తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడా సీక్రెట్ ను నేషనల్ ఎంక్వైరర్ బయటపెట్టింది. జెఫ్ బెజోస్‌కు హాలీవుడ్ టాలెంట్ […]

జెఫ్ బెజోస్…ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అంతేకాదు అమెజాన్ ఫౌండర్ కూడా. తన 25ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యాడు. భార్య మెంకజీ బెజోస్ కు విడాకులు ఇవ్వబోతున్నాడన్న వార్త చర్చనీయాంశంగా మారింది.

బెజోస్ విడాకుల అంశం కంపెనీపై, షేర్లపై ఎలాంటి ప్రభావం చూపక పోయినప్పటికీ…. వారి మధ్య విభేదాలు తలెత్తడానికి గల కారణం తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడా సీక్రెట్ ను నేషనల్ ఎంక్వైరర్ బయటపెట్టింది. జెఫ్ బెజోస్‌కు హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్‌సెల్ భార్య లారెన్ సాంచెజ్‌తో వివాహేతర సంబంధం ఉన్న కారణంగా మెకంజీ తన భర్తకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఎంక్వైరర్ వెల్లడించింది.

బెజోస్, సాంచెజ్ ఎనిమిది నెలల కిందట తొలిసారి కలిశారు. ఎంక్వైరర్ కొన్ని నెలలుగా ఈ ఇద్దరి కదలికలను గమనిస్తూ వస్తోంది. ఐదు రాష్ట్రాల్లో 40 వేల మైళ్లు వాళ్ల వెంట సీక్రెట్‌గా వెళ్లింది. వాళ్లు ప్రైవేట్ జెట్స్‌లో తిరగడం, ఫైవ్‌స్టార్ హోటళ్లలో రహస్యంగా గడపడం, డిన్నర్ డేట్స్‌కు వెళ్లడం లాంటి విషయాలను బయటపెట్టింది.
జెఫ్ బెజోస్, మెకంజీలకు నలుగురు పిల్లలు ఉన్నారు. తన సక్సెస్‌కు తన భార్యే కారణమని బెజోస్ పదే పదే చెబుతుంటారు. అలాంటిది ఇద్దరూ విడాకులు తీసుకోవడం పై చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.