Telugu Global
NEWS

మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా బరిలో రాజీవ్ శర్మ ?

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్… రాబోయే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే క్లీన్ స్వీప్ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో సత్తా చాటాలనుకుంటోంది. ఇందుకోసం సరైన అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తోంది. కీలకమైన మల్కాజ్‌గిరి స్థానం నుంచి మాజీ సీఎస్‌, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మను బరిలో దింపాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. రాజీవ్ శర్మను ఢిల్లీకి పంపితే ఆయనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి ఉపయోగపడుతాయని […]

మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా బరిలో రాజీవ్ శర్మ ?
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్… రాబోయే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే క్లీన్ స్వీప్ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో సత్తా చాటాలనుకుంటోంది. ఇందుకోసం సరైన అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తోంది.

కీలకమైన మల్కాజ్‌గిరి స్థానం నుంచి మాజీ సీఎస్‌, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మను బరిలో దింపాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. రాజీవ్ శర్మను ఢిల్లీకి పంపితే ఆయనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి ఉపయోగపడుతాయని కేసీఆర్ భావిస్తున్నారు.

తెలంగాణ సీఎస్‌గా పనిచేయడానికి ముందు ఆయన ఢిల్లీలో పనిచేశారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్‌లో రాజీవ్‌శర్మను నిలపడం ద్వారా గెలుపు సులువుగా సాధ్యమవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీకి రాజీవ్‌ శర్మ కూడా ఆసక్తిగా ఉన్నారు.

మల్కాజ్‌గిరి నుంచి 2014లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన మల్లారెడ్డి… ఇటీవల అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రాజీవ్‌ శర్మకు లైన్ క్లియర్ అయింది. మల్కాజ్‌గిరి టికెట్‌ ను మాజీ మంత్రి వేణుగోపాలచారి, మేయర్ బొంతు రామ్మోహన్‌ కూడా ఆశిస్తున్నారు.

First Published:  10 Jan 2019 2:32 AM IST
Next Story