తొలి అడుగులో నేను ఊహించలేదు " జగన్ ఉద్వేగం
కోట్లాది మంది మధ్య తన యాత్ర సాగుతుందని…. ఇడుపులపాయలో తొలి అడుగు వేసినప్పుడు తాను ఇంతటి స్పందన వస్తుందని ఊహించలేదన్నారు వైఎస్ జగన్. 14 నెలల పాటు నడవగలిగాను అంటే అందుకు కారణం ప్రజలేనన్నారు. నడిచింది తానే అయినా నడిపించింది ప్రజలు, దేవుడు, తన తండ్రి ఆశీస్సులే కారణమన్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి 3వేల 440 కిలోమీటర్లు ఉంటుందన్నారు. అంత కంటే ఎక్కువ దూరమే తాను నడిచానంటే […]
కోట్లాది మంది మధ్య తన యాత్ర సాగుతుందని…. ఇడుపులపాయలో తొలి అడుగు వేసినప్పుడు తాను ఇంతటి స్పందన వస్తుందని ఊహించలేదన్నారు వైఎస్ జగన్. 14 నెలల పాటు నడవగలిగాను అంటే అందుకు కారణం ప్రజలేనన్నారు.
నడిచింది తానే అయినా నడిపించింది ప్రజలు, దేవుడు, తన తండ్రి ఆశీస్సులే కారణమన్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి 3వేల 440 కిలోమీటర్లు ఉంటుందన్నారు.
అంత కంటే ఎక్కువ దూరమే తాను నడిచానంటే అందుకు కేవలం ప్రజల ఆప్యాయతే కారణమన్నారు. ఎంత దూరం నడిచామన్నది ముఖ్యం కాదని.. ఎంతమందిని కలిశాం… ఎలాంటి భరోసా ఇచ్చాం… పరిస్థితులను ఎలా అర్థం చేసుకున్నాం అన్నదే ముఖ్యమన్నారు జగన్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సభలో ప్రసంగించిన జగన్…. ప్రజలకు తాను ఎన్నటికీ రుణపడి ఉంటానన్నారు.