Telugu Global
NEWS

బాబుకు షాక్‌... ఏలేరు స్కాం పై విచారణకు హైకోర్టు ఆదేశం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏలేరు కుంభకోణం వెంటాడుతూనే ఉంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగించాలని తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1996లో అనకాపల్లి పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు కొనసాగించాలని ఏపీ సీఐడీని ఆదేశించింది. దర్యాప్తు వెంటనే పూర్తి చేసి ఏమాత్రం జాప్యం లేకుండా కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేసే అధికారం ఏ న్యాయాధికారికి ఉందన్న దానిపై పదేళ్లుగా సాగుతున్న సంకేతిక ఇబ్బందిని […]

బాబుకు షాక్‌... ఏలేరు స్కాం పై విచారణకు హైకోర్టు ఆదేశం
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏలేరు కుంభకోణం వెంటాడుతూనే ఉంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగించాలని తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1996లో అనకాపల్లి పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు కొనసాగించాలని ఏపీ సీఐడీని ఆదేశించింది.

దర్యాప్తు వెంటనే పూర్తి చేసి ఏమాత్రం జాప్యం లేకుండా కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేసే అధికారం ఏ న్యాయాధికారికి ఉందన్న దానిపై పదేళ్లుగా సాగుతున్న సంకేతిక ఇబ్బందిని కూడా హైకోర్టు తొలగించింది.

ఏలేరు కుంభకోణానికి బాధ్యులైన వారిపై ఫిర్యాదు చేసే అధికారాన్ని విశాఖ జిల్లా అనకాపల్లి, చోడవరంలోని సీనియర్‌ సివిల్ జడ్జిలకు ఉందని హైకోర్టు స్పష్టత ఇచ్చింది.

ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయదలుచుకుంటే హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

First Published:  9 Jan 2019 5:08 AM IST
Next Story