కాంగ్రెస్ మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్ జెండర్ అప్సర....
చీత్కారాలను సవాల్‌గా తీసుకుని ముందుకెళ్లిన ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నత పదవిని అధిరోహించారు. ట్రాన్స్ జెండర్ అప్సర కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ ఆమెను ఈ పదవిలో నియమించారు. పదవి అప్పగించిన సందర్బంగా ఆమె రాహుల్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనను అందరూ హేళన చేస్తూ ఉండేవారు… తన జీవితంలో అద్భుతాలేవీ జరగవని నిరుత్సాహపరిచే వారని ఆమె వివరించారు. కానీ వెక్కిరింపులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ ముందుకెళ్లానని చెప్పారు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన […]
చీత్కారాలను సవాల్‌గా తీసుకుని ముందుకెళ్లిన ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నత పదవిని అధిరోహించారు. ట్రాన్స్ జెండర్ అప్సర కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ ఆమెను ఈ పదవిలో నియమించారు. పదవి అప్పగించిన సందర్బంగా ఆమె రాహుల్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తనను అందరూ హేళన చేస్తూ ఉండేవారు… తన జీవితంలో అద్భుతాలేవీ జరగవని నిరుత్సాహపరిచే వారని ఆమె వివరించారు. కానీ వెక్కిరింపులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ ముందుకెళ్లానని చెప్పారు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన రాహుల్‌గాంధీకి కృజ్ఞతలు తెలిపారు. మహిళలు, పిల్లలు, ట్రాన్స్‌జెండర్ల తరపున మరింత బలంగా తాను పోరాటం చేస్తానని అప్సర వెల్లడించారు.
అప్సర తొలుత జర్నలిస్టుగా పనిచేసేవారు. ఆ తర్వాత అన్నాడీఎంకేలో పనిచేశారు. జయ మరణం తర్వాత శశికళ వైపు నిలబడ్డ ఆమె… అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. అనతి కాలంలోనే జాతీయ మహిళా కాంగ్రెస్ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్సరకి జాతీయ కాంగ్రెస్ మహిళా విభాగం స్వాగతం పలికింది.