పాక్‌లో గులాబ్ జామూన్ గొడవ
ప్రముఖ స్వీట్ ఐటమ్ గులాబ్ జామూన్‌ను పాకిస్తాన్ తమ జాతీయ తీపి పదార్ధంగా ప్రకటించుకుంది. అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి. జాతీయ తీపి పదార్ధంగా ఏ ఐటమ్‌ను ఎంపిక చేయాలన్న దానిపై పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజాభిప్రాయసేకరణ చేసింది. ట్వీట్టర్ ద్వారా పోల్ నిర్వహించింది. గులాబ్ జామూన్, బర్ఫీ, జిలేబీల్లో ఏ స్వీటును నేషనల్ స్వీటుగా ఎంపిక చేయాలో చెప్పాలంటూ ప్రభుత్వ అధికారిక ట్వీట్టర్ అకౌంట్‌లో పోల్ నిర్వహించారు. What is the National Sweet of Pakistan? […]
ప్రముఖ స్వీట్ ఐటమ్ గులాబ్ జామూన్‌ను పాకిస్తాన్ తమ జాతీయ తీపి పదార్ధంగా ప్రకటించుకుంది. అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి. జాతీయ తీపి పదార్ధంగా ఏ ఐటమ్‌ను ఎంపిక చేయాలన్న దానిపై పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజాభిప్రాయసేకరణ చేసింది.
ట్వీట్టర్ ద్వారా పోల్ నిర్వహించింది. గులాబ్ జామూన్, బర్ఫీ, జిలేబీల్లో ఏ స్వీటును నేషనల్ స్వీటుగా ఎంపిక చేయాలో చెప్పాలంటూ ప్రభుత్వ అధికారిక ట్వీట్టర్ అకౌంట్‌లో పోల్ నిర్వహించారు.
What is the National Sweet of Pakistan?
— Govt of Pakistan (@pid_gov) January 1, 2019
47 శాతం మంది నెటిజన్లు గులాబ్ జామూన్‌కు జై కొట్టారు. 34 శాతం ఓట్లు జిలేబీకి వచ్చాయి. 19 శాతం మంది బర్ఫీకి ఓటేశారు. దాంతో గులాబ్ జామూన్‌ను నేషనల్ స్వీట్‌గా ప్రభుత్వం ప్రకటించింది.
గులాబ్ జామూన్‌ను నేషనల్ స్వీట్‌గా ఎంపిక చేయడంపై మరికొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు తమ దేశానికి చెందని స్వీటును జాతీయ తీపి పదార్ధంగా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పోల్ నిజాయితీగా సాగలేదని, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
గులాబ్ జామూన్‌ను మొగలుల కాలంలో కనుగొన్నారని కొందరు చెబుతుండగా…. కాదు అది టర్కీ దేశస్తులు దండెత్తి వచ్చినప్పుడు పాక్‌లోకి ఎంటరైందని మరికొందరు వాదిస్తున్నారు. విదేశీ మూలాలున్న పదార్ధాన్ని జాతీయ తీపి పదార్ధంగా ప్రకటించడం జాతికే అవమానం అని నెటిజన్లు మండిపడుతున్నారు.