పొత్తుపై నవీన్ కీలక ప్రకటన
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న మహాకూటమికి నవీన్ పట్నాయక్ షాక్ ఇచ్చారు. చంద్రబాబు చక్రం తిప్పుతారని… నవీన్ పట్నాయక్ కూడా మహాకూటమిలో చేరనున్నారని ఆ మధ్య మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అలాంటి వార్తలకు నవీన్ పట్నాయక్ తెర దింపారు. తాము మహాకూటమిలో చేరడం లేదని స్పష్టమైన ప్రకటన చేశారు. ఇదివరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పిన నవీన్ పట్నాయక్ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కూటమిలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో బీజేపీతో […]
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న మహాకూటమికి నవీన్ పట్నాయక్ షాక్ ఇచ్చారు. చంద్రబాబు చక్రం తిప్పుతారని… నవీన్ పట్నాయక్ కూడా మహాకూటమిలో చేరనున్నారని ఆ మధ్య మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే అలాంటి వార్తలకు నవీన్ పట్నాయక్ తెర దింపారు. తాము మహాకూటమిలో చేరడం లేదని స్పష్టమైన ప్రకటన చేశారు. ఇదివరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పిన నవీన్ పట్నాయక్ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కూటమిలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అదే సమయంలో బీజేపీతో కూడా కలవబోమని ప్రకటించారు. బీజేడీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. బీజేడీ తొలి నుంచి తటస్త వైఖరి అనుసరిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా అదే లైన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… నవీన్ పట్నాయక్‌ను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారు. ఒడిషాలో నవీన్ నేతృత్వంలోని బీజేడీ తిరుగులేని పార్టీగా చలామణి అవుతోంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో 21 స్థానాలకు గాను ఏకంగా 20 స్థానాలను బీజేడీ సొంతం చేసుకుంది. ఈ సారి కూడా ఆ పార్టీకే ఏకపక్షంగా ఫలితాలు ఉండవచ్చని భావిస్తున్నారు.