వంగవీటి రాధా అందుకే హాజరు కావడం లేదు...
ఎన్నికలు సమీపిస్తుండడంతో పలు నియోజక వర్గాల్లో వైఎస్ జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొందరు ఇన్ చార్జ్ ల నియోజక వర్గాలు మారుస్తున్నారు. మరికొందరిని పూర్తిగా పక్కన పెడుతున్నారు. సర్వేల ఆధారంగా జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా టికెట్ విషయం ఇంకా ఒక కొలిక్కిరావడం లేదు. విజయవాడ సెంట్రల్ నుంచి రాధా పోటీ చేయాలని భావించగా…. ఆ సీటును మల్లాది విష్ణుకు జగన్ కేటాయించారు. మచిలీపట్నం పార్లమెంట్‌కు పోటీ చేయాల్సిందిగా రాధాను […]
ఎన్నికలు సమీపిస్తుండడంతో పలు నియోజక వర్గాల్లో వైఎస్ జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొందరు ఇన్ చార్జ్ ల నియోజక వర్గాలు మారుస్తున్నారు. మరికొందరిని పూర్తిగా పక్కన పెడుతున్నారు. సర్వేల ఆధారంగా జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా టికెట్ విషయం ఇంకా ఒక కొలిక్కిరావడం లేదు.
విజయవాడ సెంట్రల్ నుంచి రాధా పోటీ చేయాలని భావించగా…. ఆ సీటును మల్లాది విష్ణుకు జగన్ కేటాయించారు. మచిలీపట్నం పార్లమెంట్‌కు పోటీ చేయాల్సిందిగా రాధాను జగన్ కోరారు. అప్పటి నుంచి రాధా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తొలుత బుజ్జగించే ప్రయత్నాలు చేసిన వైసీపీ నాయకత్వం కూడా ఈ మధ్య సైలెంట్‌గా ఉంది.
జగన్ పాదయాత్ర ఇచ్చాపురంలో రేపు ముగుస్తుండడంతో వంగవీటి రాధా ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఇందుకు రాధా కారణం కూడా చెబుతున్నారు. పార్టీ వైఖరి నచ్చకే తాను వెళ్లడంలేదని చెప్పడం లేదు గానీ…. తనకు ఆహ్వానం లేదని అనుచరుల వద్ద చెబుతున్నారు.
కేవలం నియోజక వర్గాల సమన్వయకర్తలకు మాత్రమే ఆహ్వానం పంపారని… ఇప్పుడు తాను ఏ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా లేను కాబట్టి ఆహ్వానం అందలేదని చెబుతున్నారు. అందుకే కార్యక్రమానికి వెళ్లడం లేదంటున్నారు.
ఆహ్వానాలు ఇన్‌చార్జ్‌లకే కాకుండా పార్టీ సీనియర్లకు కూడా పంపారు. అయితే వంగవీటి రాధా మాత్రం తనకు ఆహ్వానం అందలేదని… అందుకే పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరుకావడం లేదని చెప్పడం చర్చనీయాంశమైంది.