తెనాలిలో పవన్ భోగి వేడుకలు.... ఆ తర్వాత కీలక ప్రకటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాత కీలక ప్రకటన చేయనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే జిల్లా పోరాట యాత్రలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న పవన్ రాబోయే పండుగ రోజుల్లో ఎక్కడకు వెళ్లాలో ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండగ రోజుల్లో ఆయన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. భోగి పండుగ నాడు ఇటీవల జనసేనలో చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో గడపనున్నారు. ఆ తర్వాత […]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాత కీలక ప్రకటన చేయనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే జిల్లా పోరాట యాత్రలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న పవన్ రాబోయే పండుగ రోజుల్లో ఎక్కడకు వెళ్లాలో ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.
సంక్రాంతి పండగ రోజుల్లో ఆయన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. భోగి పండుగ నాడు ఇటీవల జనసేనలో చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో గడపనున్నారు. ఆ తర్వాత ఆయన వ్యవసాయ సంబంధిత సమస్యలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో రైతులకు సంక్రాంతి చాలా ముఖ్యమైన పండగ. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి తర్వాత తెనాలి నుంచి రైతులను ఉద్దేశించి కీలక ప్రకటన చేయాలని పవన్ నిర్ణయించారు.