Telugu Global
NEWS

జగన్ హత్యాయత్నం కేసులో సరికొత్త ట్విస్ట్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యయత్నం కేసులో ఇవాళ మరో ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటికే ఈ కేసును ఏపీ సీఐడీ నుంచి కేంద్ర పరిథిలోని ఎన్ఐఏకు బదిలీ చేస్తూ ఏపీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు తిరిగి ప్రారంభిచారు. అయితే ఈ కేసులో హత్యాయత్నం చేసిన నిందితుడైన శ్రీనివాసరావు తరపు న్యాయవాది ఎన్ఐఏ అధికారులకు షాక్ ఇచ్చారు. ఇప్పటి […]

జగన్ హత్యాయత్నం కేసులో సరికొత్త ట్విస్ట్
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యయత్నం కేసులో ఇవాళ మరో ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటికే ఈ కేసును ఏపీ సీఐడీ నుంచి కేంద్ర పరిథిలోని ఎన్ఐఏకు బదిలీ చేస్తూ ఏపీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు తిరిగి ప్రారంభిచారు.

అయితే ఈ కేసులో హత్యాయత్నం చేసిన నిందితుడైన శ్రీనివాసరావు తరపు న్యాయవాది ఎన్ఐఏ అధికారులకు షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించినట్లు తనకు గానీ, తన క్లయింట్‌కు గానీ ఎలాంటి నోటీసులు అందలేదని న్యాయవాది సలీమ్ చెప్పారు.

ఇప్పటికే నిందితుడు శ్రీనివాస్ తరపున బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశామని…. కాని ఎన్ఐఏ తరపు నుంచి ఏ న్యాయవాదీ కోర్టుకు హాజరు కాలేదని ఆయన స్పష్టం చేశారు. బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారని ఆయన అన్నారు.

First Published:  8 Jan 2019 3:35 AM IST
Next Story