ఏపీ పోలీసులు సహకరించడం లేదని కోర్టుకు వెళ్ళిన ఎన్‌ఐఏ
జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నం విషయంలో ఏపీ పోలీసుల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే ఏపీ డీజీపీ తోచినట్టుగా ఏదో ప్రకటన చేశాడు. విచారణ అంటూ ఏమీ లేకుండానే జగన్ పై హత్యాయత్నం చేసింది ఆయన అభిమానే అని స్వయంగా డీజీపీ ప్రకటించాడు. ఆ విధంగా అభాసుపాలయ్యాడు. ఆ తర్వాత ఇటీవల విశాఖ సీపీ మాట్లాడుతూ…. జగన్ పై అటాక్ చేసిన నిందితుడు కేవలం […]
జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నం విషయంలో ఏపీ పోలీసుల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే ఏపీ డీజీపీ తోచినట్టుగా ఏదో ప్రకటన చేశాడు. విచారణ అంటూ ఏమీ లేకుండానే జగన్ పై హత్యాయత్నం చేసింది ఆయన అభిమానే అని స్వయంగా డీజీపీ ప్రకటించాడు. ఆ విధంగా అభాసుపాలయ్యాడు.
ఆ తర్వాత ఇటీవల విశాఖ సీపీ మాట్లాడుతూ…. జగన్ పై అటాక్ చేసిన నిందితుడు కేవలం సంచలనం కోసమే ఆ పని చేశాడని ప్రకటించాడు. ఇప్పుడు జగన్ అభిమాని అనే ట్యాగ్ తీసేసి మాట్లాడారు.
ఇక ఈ వ్యవహారంపై ఎన్ఐఏ విచారణ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విచిత్రమైన ప్రకటనలు చేసింది. ఎన్ఐఏ విచారణ జరగకూడదు అన్నట్టుగా ఏపీ మంత్రులు యనమల, లోకేష్ తదితరులు వ్యాఖ్యానించారు. ఈ విధంగా తమ అజెండా ఏమిటో వీళ్లు స్పష్టం చేశారు.
నేతలే ఇలా ప్రకటనలు చేస్తూ ఉంటే.. పోలీసులు మరెలా వ్యవహరిస్తారో ఊహించుకోవచ్చు. ఈ కేసు విచారణలో ఎన్ఐఏకు ఏపీ పోలీసులు సహకరించడం లేదని మొదటి రోజే స్పష్టం అయ్యింది. ఈ నేఫథ్యంలో ఎన్ఐఏ అధికారులు హై కోర్టును ఆశ్రయించారు. తమకు ఏపీ పోలీసులు డాక్యుమెంట్లు కూడా ఇవ్వలేదని.. వాటిని ఇప్పించాలని కోరుతూ ఎన్ఐఏ తరఫున పిటిషన్ దాఖలైంది. అలాగే నిందితుడిని విచారణ నిమిత్తం కస్టడీకి కూడా అడిగారు ఎన్ఐఏ అధికారులు.