అంబటిపై తిరుగుబాటు మీటింగ్
గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంబటిరాంబాబు ఈసారి ఎలాగైనా గెలవాలనుకుంటున్నారు. టికెట్ కూడా ఆయనకే దక్కే చాన్స్ ఉంది. అయితే స్థానిక నేతలు మాత్రం ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అంబటి రాంబాబు తమపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని… ఒంటెద్దు పోకడలకు పోతున్నారని మండిపడుతున్నారు. సత్తెనపల్లిలో ఏకంగా ప్రత్యేకంగా అంబటిపై తిరుగుబాటు సమావేశం ఏర్పాటు చేశారు స్థానిక నేతలు. ఈ సమావేశానికి సత్తెనపల్లి మాజీ అధ్యక్షుడు ప్రభాకర్, రాజుపాలెం జెడ్పీటీసీ […]
గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంబటిరాంబాబు ఈసారి ఎలాగైనా గెలవాలనుకుంటున్నారు. టికెట్ కూడా ఆయనకే దక్కే చాన్స్ ఉంది. అయితే స్థానిక నేతలు మాత్రం ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అంబటి రాంబాబు తమపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని… ఒంటెద్దు పోకడలకు పోతున్నారని మండిపడుతున్నారు.
సత్తెనపల్లిలో ఏకంగా ప్రత్యేకంగా అంబటిపై తిరుగుబాటు సమావేశం ఏర్పాటు చేశారు స్థానిక నేతలు. ఈ సమావేశానికి సత్తెనపల్లి మాజీ అధ్యక్షుడు ప్రభాకర్, రాజుపాలెం జెడ్పీటీసీ మర్రి వెంకటరామిరెడ్డి నాయకత్వం వహించారు. అంబటిరాంబాబును తాము భరించలేమని… ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించవద్దని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. అంబటి తీరుపై పలుమార్లు జగన్‌కే నేరుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు.
సత్తెనపల్లిలో పార్టీని నమ్ముకున్న వారిని అంబటి రాంబాబు దెబ్బతీస్తూ పార్టీని నిర్వీర్యం చేశారని మండల నాయకుడు గజ్జల నాగభూషణం ఆరోపించారు. అంబటి తన తీరు వల్లే ఓటమిని కొనితెచ్చుకుంటున్నారని మైనార్టీ నేత రహమతుల్లా విమర్శించారు.
నియోజకవర్గ స్థానిక నేతలంతా జగన్‌ను కలిసి అంబటి స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాల్సిందిగా కోరాలని సమావేశంలో నిర్ణయించుకున్నారు. అంబటి రాంబాబును కాకుండా ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా సమిష్టిగా పనిచేసి గెలిపిస్తామని వారు ప్రకటించారు. ఈ సమావేశానికి భారీగా వైసీపీ కార్యకర్తలు తరలిరావడం విశేషం.