Telugu Global
National

సుప్రీం సంచలన తీర్పు... సీబీఐ చీఫ్‌గా మన్నెం తొలగింపు

సీబీఐలో నెలకొన్న వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీబీఐ చీఫ్‌ అలోక్‌ వర్మను బలవంతంగా సెలవుపై పంపడాన్ని తప్పుపట్టింది. అలోక్‌ వర్మను తిరిగి సీబీఐ చీఫ్‌గా నియమిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. సీబీఐ డైరెక్టర్‌కు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండాలని సుప్రీం అభిప్రాయపడింది. అలోక్‌ వర్మను సెలవుపై పంపి… సీబీఐ చీఫ్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. సీబీఐలోని ఇద్దరు టాప్ ఆఫీసర్ల మధ్య విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో […]

సుప్రీం సంచలన తీర్పు... సీబీఐ చీఫ్‌గా మన్నెం తొలగింపు
X

సీబీఐలో నెలకొన్న వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీబీఐ చీఫ్‌ అలోక్‌ వర్మను బలవంతంగా సెలవుపై పంపడాన్ని తప్పుపట్టింది. అలోక్‌ వర్మను తిరిగి సీబీఐ చీఫ్‌గా నియమిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

సీబీఐ డైరెక్టర్‌కు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండాలని సుప్రీం అభిప్రాయపడింది. అలోక్‌ వర్మను సెలవుపై పంపి… సీబీఐ చీఫ్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది.

సీబీఐలోని ఇద్దరు టాప్ ఆఫీసర్ల మధ్య విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసమే అలోక్‌వర్మను సెలవుపై వెళ్లాల్సిందిగా కోరామన్న కేంద్రం వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అలోక్‌వర్మను సీబీఐ చీఫ్‌గా తిరిగి నియమిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నాగేశ్వరావు పదవి నుంచి తప్పుకోవడం ఖాయమైంది.

అలోక్‌వర్మ

అక్టోబర్‌ 23న అలోక్‌వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది. అయితే ఈ వ్యవహారంపై హైపవర్ కమిటీ నివేదిక పూర్తి స్థాయిలో వచ్చే వరకు సీబీఐ చీఫ్‌గా అలోక్ వర్మ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.

First Published:  8 Jan 2019 5:29 AM IST
Next Story