ఓవైసీతో గౌతంరెడ్డి భేటీ
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని వైసీపీ ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతంరెడ్డి కలిశారు. సుమారు నాలుగు గంటల పాటు ఇద్దరి భేటీ జరిగింది. భేటీలో రాజకీయ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ తరపున ప్రచారం చేస్తానని ఓవైసీ ప్రకటించిన నేపథ్యంలో జగన్‌కు సన్నిహితుడైన గౌతమ్ రెడ్డి ఓవైసీని కలవడం చర్చనీయాంశమైంది. ఏపీలో చంద్రబాబును ఎదుర్కొనేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై ఇద్దరూ చర్చించారు. ఏపీలో ఎంఐఎం నుంచి ఎలాంటి సహకారాన్ని వైసీపీ ఆశిస్తోంది… జగన్ […]

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని వైసీపీ ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతంరెడ్డి కలిశారు. సుమారు నాలుగు గంటల పాటు ఇద్దరి భేటీ జరిగింది. భేటీలో రాజకీయ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ తరపున ప్రచారం చేస్తానని ఓవైసీ ప్రకటించిన నేపథ్యంలో జగన్‌కు సన్నిహితుడైన గౌతమ్ రెడ్డి ఓవైసీని కలవడం చర్చనీయాంశమైంది. ఏపీలో చంద్రబాబును ఎదుర్కొనేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై ఇద్దరూ చర్చించారు.
ఏపీలో ఎంఐఎం నుంచి ఎలాంటి సహకారాన్ని వైసీపీ ఆశిస్తోంది… జగన్ ఏమనుకుంటున్నారు వంటి అంశాలను ఓవైసీకి గౌతమ్ రెడ్డి వివరించారు. అసదుద్దీన్ ఓవైసీకి… గౌతమ్ రెడ్డికి మధ్య వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో చర్చకు గౌతమ్ రెడ్డిని పంపినట్టు తెలుస్తోంది.
వైసీపీ వర్గాలు మాత్రం ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదంటున్నారు. ఓవైసీ, గౌతమ్ రెడ్డి స్నేహితులు కావడం వల్లే వారు భేటీ అయి ఉంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు.