Telugu Global
National

రిజర్వేషన్ల చట్టం ఆమోదం కోసం....

రాజ్యసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 9 (బుధవారం) వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు మునుపు షెడ్యూల్ ప్రకారం రేపటితో రాజ్యసభ సమావేశాలు ముగియాలి. కాగా.. ఇవాళ అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఒక వేళ లోక్‌సభలో పాస్ అయితే వెంటనే రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలుగా పెద్దల సభను మరో […]

రిజర్వేషన్ల చట్టం ఆమోదం కోసం....
X

రాజ్యసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 9 (బుధవారం) వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు మునుపు షెడ్యూల్ ప్రకారం రేపటితో రాజ్యసభ సమావేశాలు ముగియాలి. కాగా.. ఇవాళ అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఒక వేళ లోక్‌సభలో పాస్ అయితే వెంటనే రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలుగా పెద్దల సభను మరో రోజు పొడిగించారు. ఎలాగైనా శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పాస్ చేయించాలనే పట్టుదలతో మోడీ ప్రభుత్వం ఉంది.

రేపు లోక్‌సభలో కేంద్ర మంత్రి థవార్ చంద్ గెహ్లట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను సవరిస్తూ ఈ బిల్లు ప్రవేశపెడతారు. ఈ బిల్లు పాస్ కావాలంటే ఇరు సభల్లో 2/3 వంతు మంది ఆమోదించాల్సి ఉంది.

First Published:  7 Jan 2019 10:25 AM GMT
Next Story