Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో సునీల్

స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్… హీరో ఇంకా కమెడియన్ సునీల్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. సునీల్ కి ప్రస్తుతం హీరోగా అవకాశాలు లేవు, ఇలాంటి సమయం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తానూ ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి డైరెక్ట్ చేసిన “అరవింద సమేత” లో సునీల్ కోసం ఒక స్పెషల్ క్యారెక్టర్ ని రాసుకున్నాడు. ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్, సునీల్ మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుందని భావించారు. కానీ ఈ […]

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో సునీల్
X

స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్… హీరో ఇంకా కమెడియన్ సునీల్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. సునీల్ కి ప్రస్తుతం హీరోగా అవకాశాలు లేవు, ఇలాంటి సమయం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తానూ ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి డైరెక్ట్ చేసిన “అరవింద సమేత” లో సునీల్ కోసం ఒక స్పెషల్ క్యారెక్టర్ ని రాసుకున్నాడు. ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్, సునీల్ మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుందని భావించారు. కానీ ఈ సినిమా చాలా సీరియస్ టోన్ లో సాగిపోయింది.

అయితే ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ సునీల్ కోసం కామెడీ పాత్ర రాస్తున్నాడట. అల్లు అర్జున్ తో తీయబోతున్న సినిమాలో సునీల్ కోసం ఓ మంచి పాత్ర రాసుకున్నాడట త్రివిక్రమ్. సునీల్ ని మళ్ళీ వింటేజ్ సునీల్ గా చూపించే సత్తా త్రివిక్రమ్ కే వుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి త్రివిక్రమ్ సునీల్ కి కమెడియన్ గా మళ్ళి కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ వారు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  7 Jan 2019 3:46 AM IST
Next Story