సంక్రాంతి వంటకాలు.... అరిసెలు తయారీ విధానం
Ariselu Recipe: మన సంప్రదాయ వంటకాలన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే. బెల్లంలో ఐరన్ బాగా ఉంటుంది. నువ్వుల్లో మోనో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది మహిళల్లో హార్మోన్ లెవెల్స్‌ను మెయింటెయిన్ చేస్తుంది.
మన సంప్రదాయ వంటకాలన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే. బెల్లంలో ఐరన్ బాగా ఉంటుంది. నువ్వుల్లో మోనో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది మహిళల్లో హార్మోన్ లెవెల్స్‌ను మెయింటెయిన్ చేస్తుంది.
ఈ స్వీట్స్ వల్ల మరొక ఉపయోగం ఏమిటంటే… వీటిలో పోషకాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ తిన్న వెంటనే ఒంట్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం ఉండదు. నెమ్మదిగా జీర్ణం అవుతూ శక్తి నిదానంగా విడుదలవుతుంది. పండుగలకే కాకుండా చక్కటి డైట్ ప్లాన్‌తో ఏడాది పొడవునా రోజుకు ఒకటి తింటే మంచిది. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా వీటిని పెట్టవచ్చు.
వీటితో మరొక ప్రయోజనం ఏమిటంటే… వీటిని తర్వాత సాచురేషన్ వస్తుంది. కాబట్టి చిప్స్ వంటి ఇతర జంక్‌ఫుడ్ జోలికి మనసు పోదు.
కావలసిన వస్తువులు
- అరిశెలు
- బియ్యం- ఒక కిలో
- బెల్లం – 800 గ్రాములు
- నువ్వులు, గసగసాలు – ఒక్కొక్కటి 50 గ్రాములు
- నూనె లేదా నెయ్యి – ఒక కేజీ
తయారీ:
అరిశెలు చేయడానికి ముందు రోజు నుంచి ప్రిపరేషన్ ఉంటుంది. బియ్యాన్ని ముందురోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నేనీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని సన్నని రంధ్రాలున్న జల్లెడతో జల్లించాలి.
బెల్లాన్నిచిన్న ముక్కలుగా పగలగొట్టి పెద్ద పాత్రలో ఒక గ్లాసు నీటిని పోసి బెల్లం ముక్కలు వేసి వేడి చేయాలి. బెల్లం బాగా మరిగిన తర్వాత ఒక ప్లేట్‌లో కొద్దిగా నీటిని పోసి ఆ నీటిలో బెల్లం పాకాన్ని రెండు చుక్కలు వేయాలి. బెల్లం దగ్గరగా అయితే పాకం రెడీ అయినట్లు. పాకం పాత్రను మంట మీద నుంచి కిందకు దించి బియ్యం పిండి, గసగసాలు, నువ్వులు వేసి కలపాలి. ఆ పిండి మీద కొద్ది గా నెయ్యి వేసి మూత పెట్టాలి.
బాణలిలో నెయ్యి లేదా నూనె పోసి కాగిన తర్వాత… పాకం పిండిని పెద్ద గోళీ అంత తీసుకుని పాలిథిన్ పేపర్ మీద కాని విస్తరి ఆకు మీద కాని వేసి వేళ్లతో ఒత్తాలి. దానిని బాణలిలో వేసి రెండు వైపులా కాలనిచ్చి తీసి చిల్లుల పీట మీద వేసి (అదనపు నెయ్యి లేదానూనె పోయేటట్లు) వత్తాలి. అరిశె రెడీ. చల్లారిన తర్వాత తడిలేని డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా చేసిన అరిశెలు 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి.