Telugu Global
National

మోడీకి తలొగ్గిన ఆర్బీఐ

కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర డివిడెండ్ రూపంలో 40 వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్దమైంది. ఈ డబ్బును మార్చి లోపు కేంద్రానికి ఇవ్వనున్నట్లు బ్యాంకు ఉన్నత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది కేంద్రానికి పన్ను రాబడులు తగ్గిపోవడంతో లోటు బడ్జెట్ ఏర్పడింది. ఈ లోటును ఆర్బీఐ నిధులతో పూడ్చుకోవాలని కేంద్రం భావించింది. గత ఏడాది ఉర్జిత్ పటేల్ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే కేంద్రం నుంచి ఆర్బీఐకి ఈ ప్రతిపాదన వెళ్లింది. అయితే […]

మోడీకి తలొగ్గిన ఆర్బీఐ
X

కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర డివిడెండ్ రూపంలో 40 వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్దమైంది. ఈ డబ్బును మార్చి లోపు కేంద్రానికి ఇవ్వనున్నట్లు బ్యాంకు ఉన్నత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది కేంద్రానికి పన్ను రాబడులు తగ్గిపోవడంతో లోటు బడ్జెట్ ఏర్పడింది. ఈ లోటును ఆర్బీఐ నిధులతో పూడ్చుకోవాలని కేంద్రం భావించింది.

గత ఏడాది ఉర్జిత్ పటేల్ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే కేంద్రం నుంచి ఆర్బీఐకి ఈ ప్రతిపాదన వెళ్లింది. అయితే ఆయన తీవ్రంగా వ్యతిరేకించడంతోనే ఆర్బీఐ, కేంద్రం మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రానికి ఆర్బీఐ నుంచి నిధులు విడుదల చేసేది లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఉర్జిత్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి శక్తికాంత్ దాస్ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేంద్రానికి మధ్యంతర డివిడెంట్ చెల్లించాలని శక్తికాంత్ దాస్ నిర్ణయించడం విశేషం. అంతే కాకుండా ఆర్బీఐ మిగులు నిధుల పంపిణీపై కేంద్రంతో కలిసి ఒక కమిటీని కూడా నియమించారు.

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పడిపోయిన కేంద్ర ఆదాయాన్ని…. ఆర్బీఐ నిధులతో భర్తీ చేసుకునే వెసులు బాటు లభించింది.

First Published:  7 Jan 2019 12:28 PM IST
Next Story