జస్టిస్ గంగారామ్‌ను నిజంగానే నిలబెట్టారా? ఇదీ ఫొటో అసలు సంగతి ....
సోషల్ మీడియా అనేక వాస్తవాలను ప్రపంచం ముందుంచుతోంది. ప్రధాన మీడియా సంస్థలు అటుఇటు వాలిపోయిన తరుణంలో సోషల్ మీడియా నిజాల వెలికితీతలో కీలక పాత్ర పోషిస్తోంది. అదే సమయంలో కొందరు అకతాయిలు ఫేక్ వార్తలను కూడా ప్రచారంలోకి తెస్తున్నారు. ముఖ్యంగా రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు లేనిపోని ప్రచారం చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏపీలోనూ ఇలాంటివి సర్వసాధారణం అయ్యాయి. అన్ని పార్టీల అభిమానులు పోటీ పడి ఫేక్ న్యూస్ లను సృష్టిస్తున్నారు. న్యాయమూర్తులను కూడా వదిలిపెట్టడం లేదు. […]
సోషల్ మీడియా అనేక వాస్తవాలను ప్రపంచం ముందుంచుతోంది. ప్రధాన మీడియా సంస్థలు అటుఇటు వాలిపోయిన తరుణంలో సోషల్ మీడియా నిజాల వెలికితీతలో కీలక పాత్ర పోషిస్తోంది.
అదే సమయంలో కొందరు అకతాయిలు ఫేక్ వార్తలను కూడా ప్రచారంలోకి తెస్తున్నారు. ముఖ్యంగా రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు లేనిపోని ప్రచారం చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఏపీలోనూ ఇలాంటివి సర్వసాధారణం అయ్యాయి. అన్ని పార్టీల అభిమానులు పోటీ పడి ఫేక్ న్యూస్ లను సృష్టిస్తున్నారు. న్యాయమూర్తులను కూడా వదిలిపెట్టడం లేదు.
ఇటీవల ఏపీలో హైకోర్టు ఏర్పాటు తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫొటో బాగా చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో న్యాయమూర్తులతో కలిసి ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కూర్చున్నారు. కానీ మంత్రి కొల్లు చైర్ మీద కూర్చోగా… జస్టిస్ గంగరామ్ మాత్రం కుర్చీలేక వెనుక వైపు నిలబడినట్టుగా ఫొటోలో ఉంది. ఈ ఫొటో సోషల్ మీడియాలోకి ఎవరో వదిలారు. దాంతో దుమారం రేగింది.
ఒక హైకోర్టు న్యాయమూర్తికి ఇంత అవమానమా అని నెటిజన్లు మండిపడ్డారు. న్యాయమూర్తిని నిలబెట్టి మంత్రి కూర్చోవడం ఏమిటని పలువురు విమర్శించారు. న్యాయవ్యవస్థ పట్ల టీడీపీ నేతలకు ఉన్న చిత్తశుద్దికి ఇది నిదర్శనం అని మండిపడ్డారు. అయితే ఇది నిజమైన ఫోటో కాదు. ఎవరో కొందరు అకతాయిలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఫొటోను మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదు అయింది. న్యాయవ్యవస్థ పరువు ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఫొటో మార్ఫింగ్ వ్యవహారంపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు.