బాలకృష్ణపై తన వ్యాఖ్యలకున్న పవర్ వివరించిన కేఏ పాల్
ఎవరెంత దోచుకున్నారన్న దానిపైనే మీడియా దృష్టి ఉందని కేఏ పాల్ విమర్శించారు. మీడియాకు తానిచ్చే మసాలా చాలన్నారు పాల్. తన మాటలను కవర్ చేసి చూస్తే ఆ విషయం తెలుస్తుందన్నారు. ఇటీవల ఒక చిన్న చానల్‌లో…. ఒక యాక్టర్ (బాలకృష్ణ) ఎవరో తనకు తెలియదంటూ చేసిన కామెంట్ వీడియోను ఏకంగా 16 లక్షల మంది వీక్షించారని పాల్ వివరించారు. తనకున్న ఫాలోయింగ్ కు అదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో తనకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వారు […]
ఎవరెంత దోచుకున్నారన్న దానిపైనే మీడియా దృష్టి ఉందని కేఏ పాల్ విమర్శించారు. మీడియాకు తానిచ్చే మసాలా చాలన్నారు పాల్. తన మాటలను కవర్ చేసి చూస్తే ఆ విషయం తెలుస్తుందన్నారు.
ఇటీవల ఒక చిన్న చానల్‌లో…. ఒక యాక్టర్ (బాలకృష్ణ) ఎవరో తనకు తెలియదంటూ చేసిన కామెంట్ వీడియోను ఏకంగా 16 లక్షల మంది వీక్షించారని పాల్ వివరించారు. తనకున్న ఫాలోయింగ్ కు అదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో తనకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వారు ఎవరున్నారో చెప్పాలన్నారు.
రాష్ట్రాన్ని కాపాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఏపీలో ప్రతిపక్షం విఫలమవడం వల్లే చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోగలిగారన్నారు. మరో 20 రోజుల్లో ప్రజాశాంతి పార్టీ ప్రభంజనాన్ని సృష్టిస్తుందన్నారు.
ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల చొప్పున విరాళం ఇస్తానని పాల్ ప్రకటించారు. తాను ఎవరితోనూ పొత్తుపెట్టుకోనని… ఒకవేళ ఎవరైనా పొత్తు కోసం వస్తే ఐదో, పదో సీట్లు ఇస్తానని వెల్లడించారు.