Telugu Global
NEWS

క్రికెట్లో అలా... ఫుట్ బాల్ లో ఇలా...!

భారత్ మీడియాలో ఎందుకీ వివక్ష? 2019 ఆసియాకప్ ఫుట్ బాల్ లో భారత్ సంచలన విజయం గ్రూప్-ఏ లీగ్ లో థాయ్ లాండ్ పై 4-1 గోల్స్ తో గెలుపు డబుల్ కిక్ తో సునీల్ చెత్రీ మ్యాజిక్ మెస్సీ రికార్డును అధిగమించిన సునీల్ చెత్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమైన 2019 ఆసియాకప్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ లో… 97వ ర్యాంక్ జట్టు భారత్ సంచలన విజయం సాధించింది. గ్రూప్-ఏ లీగ్ ప్రారంభ మ్యాచ్ లో […]

క్రికెట్లో అలా... ఫుట్ బాల్ లో ఇలా...!
X
  • భారత్ మీడియాలో ఎందుకీ వివక్ష?
  • 2019 ఆసియాకప్ ఫుట్ బాల్ లో భారత్ సంచలన విజయం
  • గ్రూప్-ఏ లీగ్ లో థాయ్ లాండ్ పై 4-1 గోల్స్ తో గెలుపు
  • డబుల్ కిక్ తో సునీల్ చెత్రీ మ్యాజిక్
  • మెస్సీ రికార్డును అధిగమించిన సునీల్ చెత్రీ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమైన 2019 ఆసియాకప్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ లో… 97వ ర్యాంక్ జట్టు భారత్ సంచలన విజయం సాధించింది. గ్రూప్-ఏ లీగ్ ప్రారంభ మ్యాచ్ లో థాయ్ లాండ్ ను 4-1 గోల్స్ తో చిత్తు చేసింది.

అబుదాబీ అల్ నహయాన్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోటీలో…సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారత్..34 శాతం మాత్రమే బంతిని తన అదుపులో ఉంచుకొన్నా…వచ్చిన ప్రతి అవకాశాన్ని గోలుగా మలచుకొని..4-1 గోల్స్ తో అతిపెద్ద విజయం నమోదు చేసింది.

అరుదైన విజయం….

భారత గోల్ మెషీన్ సునీల్ చెత్రీ ఆట 27వ నిముషంలో తొలిగోల్, రెండో భాగం ఆట 46వ నిముషంలో రెండో గోల్ సాధించాడు, ఆట 62వ నిముషంలో అనీరుధ్ థాపా, 80వ నిముషంలో జేజీ చెరో గోల్ చేయడంతో భారత్ విజయం పూర్తయ్యింది.

1986 మర్దేకా సాకర్ కప్ టోర్నీలో థాయ్ లాండ్ పై తొలిసారిగా నెగ్గిన భారత్ కు..33 ఏళ్ల తర్వాత ఇదే మరో గెలుపు కావడం విశేషం. అంతేకాదు..1964 ఆసియాకప్ లో విజయం సాధించిన భారత్…మరో ఆసియాకప్ విజయం కోసం 2019 టోర్నీ వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

గ్రూప్-ఏ రెండోరౌండ్లో ఆతిథ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా బహ్రీన్ జట్లలో ఏదో ఒకజట్టుతో భారత్ తలపడాల్సి ఉంది. రెండోరౌండ్ ను భారత్ డ్రాగా ముగించినా…ప్రీ-క్వార్టర్ ఫైనల్ రౌండ్ చేరుకోగలుగుతుంది.

మెస్సీని మించిన చెత్రీ…

అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ పేరుతో ఉన్న అత్యధిక గోల్స్ రికార్డును భారత కెప్టెన్ సునీల్ చెత్రీ అధిగమించాడు. మెస్సీ అర్జెంటీనా కెప్టెన్ గా 128 మ్యాచ్ ల్లో65 గోల్స్ సాధిస్తే….సునీల్ చెత్రీ మాత్రం… 105 మ్యాచ్ ల్లోనే 67 గోల్స్ సాధించడం విశేషం. అత్యధిక గోల్స్ సాధించిన సాకర్ కెప్టెన్ రికార్డు పోర్చుగీసు సారథి క్రిస్టియానో రొనాల్డో పేరుతోనే ఉంది. రొనాల్డో మొత్తం 154 మ్యాచ్ ల్లో 85 గోల్స్ సాధించి..అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

క్రిస్టియానో రొనాల్డో తర్వాతి స్థానంలో సునీల్ చెత్రీ నిలిచాడు. 1964 ఆసియాకప్ లో రన్నరప్ గా నిలిచిన భారత్..1984, 2011 టోర్నీల గ్రూప్ దశలోనే నిష్క్రమించక తప్పలేదు.

ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా భారత క్రికెట్ జట్టు సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయానికి మీడియా ఇచ్చిన ప్రాముఖ్యత…భారత ఫుట్ బాల్ జట్టు సాధించిన సంచలన విజయానికి ఇవ్వకపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదు.

First Published:  7 Jan 2019 3:55 PM IST
Next Story