ఫొటో దిగితే పార్టీలో చేరుతామా?
నటుడు అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్‌ను అలీ కలవడంతో ఆయన వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరిగింది. ఈనెల 9న ఇచ్చాపురంలో వైసీపీ కండువా కప్పుకుంటారంటూ ప్రచారం సాగిపోయింది. అయితే హఠాత్తుగా ఆదివారం అలీ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆ వెంటనే వెళ్లి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిశారు. దీంతో అలీ ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ ఉత్కంఠకు అలీ తెరదింపారు. ఒక ఇంటర్వ్యూలో స్పష్టత […]
నటుడు అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్‌ను అలీ కలవడంతో ఆయన వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరిగింది. ఈనెల 9న ఇచ్చాపురంలో వైసీపీ కండువా కప్పుకుంటారంటూ ప్రచారం సాగిపోయింది. అయితే హఠాత్తుగా ఆదివారం అలీ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆ వెంటనే వెళ్లి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిశారు.
దీంతో అలీ ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ ఉత్కంఠకు అలీ తెరదింపారు. ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. తాను ఒక ఫంక్షన్‌కు వెళ్తుంటే విమానాశ్రయంలో జగన్ ఎదురుపడ్డారని చెప్పారు.
ఆ సమయంలో ఇద్దరం కుటుంబ యోగక్షేమాలపై పలకరించుకున్నామని చెప్పారు. దాన్ని ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారన్నారు. జగన్‌తో ఫొటో దిగినంత మాత్రానే పార్టీలో చేరిపోతామా అని అలీ ప్రశ్నించారు. పార్టీలో చేరే వ్యక్తినే అయితే వర్గంతో వెళ్లి జగన్‌ను కలిసేవాడినన్నారు. ఈ నెల 9న వైసీపీలో చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానమేనన్నారు. తానెక్కడా చెప్పలేదన్నారు.
వైసీపీలో చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడం అంటే ఆ పార్టీని అవమానించడమే అవుతుందని… అందుకే తాను ఆ ప్రచారాన్ని పట్టించుకోలేదన్నారు. తాను రాజకీయ కండువా కప్పుకోవడానికి సిద్దమేనని… కానీ కార్యకర్తగా కాకుండా క్యాండిడేట్‌గా కండువా కప్పుకోవాలన్నదే తన ఉద్దేశం అని అలీ చెప్పారు.