Telugu Global
Cinema & Entertainment

షర్ట్ అయితే విప్పాను కానీ చచ్చాను

వినయ విధేయ రామ సినిమా టైమ్ లో తను అనుభవించిన కష్టాలన్నింటినీ బయటపెట్టాడు రామ్ చరణ్. మరీ ముఖ్యంగా అజర్ బైజాన్ దేశంలో షూటింగ్ జరిగినప్పుడు నరకం అనుభవించానంటున్నాడు. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న వినయ విధేయ రామ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాలు బయటపెట్టాడు. “ఒంటిపై చొక్కా లేకుండా ఉన్న సన్నివేశాలున్నాయి. మరీ ముఖ్యంగా నా బాడీపై టాటూలు వేశారు. దాని కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. చూసే ప్రేక్షకులకు అది బాగుంటుంది […]

షర్ట్ అయితే విప్పాను కానీ చచ్చాను
X

వినయ విధేయ రామ సినిమా టైమ్ లో తను అనుభవించిన కష్టాలన్నింటినీ బయటపెట్టాడు రామ్ చరణ్. మరీ ముఖ్యంగా అజర్ బైజాన్ దేశంలో షూటింగ్ జరిగినప్పుడు నరకం అనుభవించానంటున్నాడు. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న వినయ విధేయ రామ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాలు బయటపెట్టాడు.

“ఒంటిపై చొక్కా లేకుండా ఉన్న సన్నివేశాలున్నాయి. మరీ ముఖ్యంగా నా బాడీపై టాటూలు వేశారు. దాని కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. చూసే ప్రేక్షకులకు అది బాగుంటుంది కానీ ఆ టాటూల వెనక కష్టం నాకు మాత్రమే తెలుసు. అవి వేయించుకోవడానికి 2 గంటల పాటు కదలకుండా నిల్చోవాలి. కనీసం కూర్చోవడానికి కూడా వీల్లేదు. షూటింగ్ తర్వాత మళ్లీ టాటూలు తీసేయడానికి మరో గంటన్నర సమయం పట్టేది.”

ఇలా షూటింగ్ టైమ్ లో తనకు ఎదురైన అనుభవాల్ని వివరించాడు చరణ్. టాటూలు ఒకెత్తయితే, అజర్ బైజాన్ లో వాతావరణం మరో ఎత్తు అంటున్నాడు చెర్రీ. కఠిన వాతావరణ పరిస్థితుల్లో షర్ట్ లేకుండా నటించానని తెలిపాడు.

“అజర్ బైజాన్ లో 6 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వర్క్ చేశాం. అంత చలిలో షర్ట్ లేకుండా నటించడమంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక్కోసారి 3 డిగ్రీలకు పడిపోయేది. అప్పుడు షూటింగ్ మరింత కష్టమైపోయేది. దానికి తోడు గుర్రంపై స్వారీ చేస్తుంటే చలిగాలి చంపేసేది.”

ఇలా ఎంతో కష్టపడి వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కించామంటున్నాడు రామ్ చరణ్. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా, జనవరి 11న థియేటర్లలోకి రాబోతోంది.

First Published:  6 Jan 2019 2:22 PM IST
Next Story