Telugu Global
Cinema & Entertainment

డేటింగ్ కాదు... ఆల్రెడీ పెళ్లైపోయింది

ఎంఎస్ ధోని బయో పిక్ లో సాక్షి సింగ్ పాత్రలో కనిపించి మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా తో పరిచయమైంది. ఆ చిత్రం తన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెబుతోంది. పక్కింటి అమ్మాయి లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించిన కైరా అద్వానీ బాలీవుడ్ లో ‘లస్ట్ స్టోరీస్’ వంటి సినిమాలో బోల్డ్ పాత్రను సైతం పోషించి […]

డేటింగ్ కాదు... ఆల్రెడీ పెళ్లైపోయింది
X

ఎంఎస్ ధోని బయో పిక్ లో సాక్షి సింగ్ పాత్రలో కనిపించి మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా తో పరిచయమైంది. ఆ చిత్రం తన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెబుతోంది.

పక్కింటి అమ్మాయి లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించిన కైరా అద్వానీ బాలీవుడ్ లో ‘లస్ట్ స్టోరీస్’ వంటి సినిమాలో బోల్డ్ పాత్రను సైతం పోషించి ప్రేక్షకులను మెప్పించింది.

అయితే గత కొంతకాలంగా కైరా అద్వానీ బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రా తో డేటింగ్ చేస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో మీరు ఎవరితో అయినా డేటింగ్ లో ఉన్నారా అని అడిగితే…. కైరా అద్వానీ ఆ ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

తను ఎవరితోనూ డేటింగ్ లో లేనని…. ఎందుకంటే తనకు ఇప్పటికే పెళ్లయిపోయిందని చెప్పింది. అదేంటి అని షాక్ అయ్యే లోపల తను చేసే సినిమాలను ప్రేమిస్తున్నానని, ఆ సినిమాలతోనే పెళ్లి చేసుకున్నానని చెప్పి మళ్ళీ షాకిచ్చింది.

ఇక త్వరలో రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్న ఈమె అటు బాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ లో షాహిద్ కపూర్ సరసన కనిపించనుంది. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా లో కూడా హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.

First Published:  6 Jan 2019 3:38 AM IST
Next Story