నన్ను ప్రశ్నిస్తే పనిచేయను
వృత్తిగతంగా కీరవాణి రెబల్ అనే విషయం పరిశ్రమలో అందరికీ తెలుసు. అందుకే అతడికి అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తుంటాయి. ఈ నేపథ్యంలో తను సినిమాల నుంచి తప్పుకుంటానని, రిటైర్మెంట్ తీసుకుంటానని రెండేళ్ల కిందటే ప్రకటించాడు ఈ సంగీత దర్శకుడు. అయితే ఆ నిర్ణయాన్ని మళ్లీ మార్చుకొని సినిమాల్లో కొనసాగుతున్నాడు. తన రిటైర్మెంట్ పై తాజాగా స్పందించిన ఈ సంగీత దర్శకుడు.. తన మనసుకు నచ్చిన వ్యక్తులతోనే పనిచేస్తానని కరాఖండిగా చెప్పేశాడు. ట్యూన్స్ విషయంలో ఎవరో ఒకరు మాత్రమే తనను […]
వృత్తిగతంగా కీరవాణి రెబల్ అనే విషయం పరిశ్రమలో అందరికీ తెలుసు. అందుకే అతడికి అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తుంటాయి. ఈ నేపథ్యంలో తను సినిమాల నుంచి తప్పుకుంటానని, రిటైర్మెంట్ తీసుకుంటానని రెండేళ్ల కిందటే ప్రకటించాడు ఈ సంగీత దర్శకుడు. అయితే ఆ నిర్ణయాన్ని మళ్లీ మార్చుకొని సినిమాల్లో కొనసాగుతున్నాడు.
తన రిటైర్మెంట్ పై తాజాగా స్పందించిన ఈ సంగీత దర్శకుడు.. తన మనసుకు నచ్చిన వ్యక్తులతోనే పనిచేస్తానని కరాఖండిగా చెప్పేశాడు. ట్యూన్స్ విషయంలో ఎవరో ఒకరు మాత్రమే తనను సంప్రదించాలని, నలుగుర్ని మెప్పించి ట్యూన్ ఓకే చేయడం తనకు నచ్చదని అంటున్నాడు. కేవలం తన ముక్కుసూటితనం కారణంగానే చాలా సినిమా అవకాశాలు పోగొట్టుకున్నానని, కానీ తనకు ఎలాంటి బాధ లేదంటున్నాడు ఈ మ్యూజిక్ డైరక్టర్.
ఓ సంగీత దర్శకుడిగా తను పూర్తి ఆత్మసంతృప్తితో ఉన్నానని, ప్రస్తుతం తనకు డబ్బు కంటే వృత్తిలో సంతృప్తి చాలా కీలకమని ప్రకటించాడు కీరవాణి. ఎన్టీఆర్ బయోపిక్ అంగీకరించడానికి కూడా అదే కారణమని తెలిపాడు.
ఇన్ని విషయాలు చెప్పిన ఈ సంగీత దర్శకుడు, రీసెంట్ గా వచ్చిన ఫ్లాప్ సినిమా సవ్యసాచి చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడో వివరించలేదు. బహుశా ఆ సినిమా యూనిట్ లో ఎవరూ ట్యూన్స్ విషయంలో కీరవాణిని ప్రశ్నించలేదేమో.