Telugu Global
International

అక్కడ అంతే.... గన్ కల్చర్ కామన్ !

ఆ దేశంలో గన్ కల్చర్ మళ్లీ పేట్రేగింది. తుపాకీ తూటాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. చాలామందిని తీవ్రంగా గాయపరిచాయి. ఎక్కడో కాదు…. అగ్రదేశం అమెరికాలోని లాస్ ఎంజెలెస్ కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర ప్రాంతం అయిన టొర్రన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:20 నిమిషాల‌కు గ్యాబ‌ల్ హౌస్ బౌల్‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఈ కాల్పులకు తెగ‌బ‌డ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు సంఘ‌ట‌నా స్థ‌లంలోనే […]

అక్కడ అంతే.... గన్ కల్చర్ కామన్ !
X

ఆ దేశంలో గన్ కల్చర్ మళ్లీ పేట్రేగింది. తుపాకీ తూటాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. చాలామందిని తీవ్రంగా గాయపరిచాయి.

ఎక్కడో కాదు…. అగ్రదేశం అమెరికాలోని లాస్ ఎంజెలెస్ కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర ప్రాంతం అయిన టొర్రన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:20 నిమిషాల‌కు గ్యాబ‌ల్ హౌస్ బౌల్‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఈ కాల్పులకు తెగ‌బ‌డ్డాడు.

ఈ కాల్పుల్లో ముగ్గురు సంఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌ర‌ణించగా…. మ‌రో ఐదుగురు గాయ‌ప‌డ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న టొర్రన్స్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అగంతకుడిని అరెస్టు చేశారు.

First Published:  6 Jan 2019 2:50 AM IST
Next Story