Telugu Global
NEWS

భారత క్రికెట్ ఆయువుపట్టు చతేశ్వర్ పూజారా

జిడ్డాటలో మొనగాడు మన నయావాల్ రాహుల్ ద్రావిడ్ ను మరపిస్తున్న పూజారా చెక్కు చెదరని ఏకాగ్రత, నేర్పు ఓర్పుతో బ్యాటింగ్ టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పూజారా….సిడ్నీ టెస్టులో రికార్డుల మోత మోగించాడు. 2016 సీజన్ నుంచి టెస్ట్ క్రికెట్లో.. అత్యధిక బంతులు ఎదుర్కొన్న టెస్ట్ క్రికెటర్ గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఇండియన్ క్రికెట్ నయావాల్ గా తనపేరు సార్థకం చేసుకొన్నాడు. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో మూడు సెంచరీలతో సహా 521 […]

భారత క్రికెట్ ఆయువుపట్టు చతేశ్వర్ పూజారా
X
  • జిడ్డాటలో మొనగాడు మన నయావాల్
  • రాహుల్ ద్రావిడ్ ను మరపిస్తున్న పూజారా
  • చెక్కు చెదరని ఏకాగ్రత, నేర్పు ఓర్పుతో బ్యాటింగ్

టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పూజారా….సిడ్నీ టెస్టులో రికార్డుల మోత మోగించాడు. 2016 సీజన్ నుంచి టెస్ట్ క్రికెట్లో.. అత్యధిక బంతులు ఎదుర్కొన్న టెస్ట్ క్రికెటర్ గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

ఇండియన్ క్రికెట్ నయావాల్ గా తనపేరు సార్థకం చేసుకొన్నాడు. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో మూడు సెంచరీలతో సహా 521 పరుగులు సాధించి… వారేవ్వా అనిపించుకొన్నాడు.

నయావాల్ కమాల్….

చతేశ్వర్ పూజారా…..టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా జట్టులో కేవలం… వన్ డౌన్ స్థానం కోసమే పుట్టిన ఆటగాడు, చెక్కుచెదరని ఏకాగ్రత, పటిష్టమైన డిఫెన్స్ తో…. క్రీజునే అంటిపెట్టుకొని గంటల తరబడి ఆడుతూ ….ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా……ప్రత్యర్థి బౌలింగ్ ఎటాక్ కు.. అడ్డుగోడగా నిలబడగల ఏకైక ఆటగాడు.

సౌరాష్ట్ర మొనగాడు….

సౌరాష్ట్ర క్రికెట్ నుంచి భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన పూజారా…..ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తో….నయా వాల్ గా టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2010 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో బెంగళూరు టెస్ట్ ద్వారా…తొలిమ్యాచ్ ఆడిన పూజారా… ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు.

ప్రస్తుత సిడ్నీ టెస్ట్ వరకూ…తన కెరియర్ లో ఆడిన 68 టెస్టుల్లో 18 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు సైతం ఉండటం చూస్తే … పూజారా ఏ రేంజ్ ఆటగాడో మరి చెప్పాల్సిన పనిలేదు.

4 టెస్టులు- మూడు శతకాలు…

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో…పూజారా టాప్ స్కోరర్ గా నిలిచాడు. అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో సెంచరీలతో చెలరేగిపోయాడు.

తన టెస్ట్ కెరియర్ లో ఏకంగా 3 డబుల్ సెంచరీలు సాధించిన పూజారా…ప్రస్తుత సిడ్నీటెస్టులో 193 పరుగులకు అవుటయ్యాడు.

అంతేకాదు..2016 సీజన్ నుంచి …ఆడిన 36 టెస్టుల్లో 6వేల 636 బాల్స్ ఎదుర్కొని… అత్యధిక బంతులు ఎదుర్కొన్న క్రికెటర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ద్రావిడ్ రికార్డు తెరమరుగు….

గతంలోనే టీమిండియా క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ పేరుతో ఉన్న 495 బాల్స్ రికార్డు ను పూజారా అధిగమించాడు. రాంచీ టెస్టులో.. అత్యధికంగా 525 బాల్స్ ఎదుర్కొనడం ద్వారా ద్రావిడ్ పేరుతో ఉన్న రికార్డును పూజారా అధిగమించాడు.

ఆసీస్ తో జరుగుతున్న ప్రస్తుత నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో..ఇప్పటి వరకూ ఆడిన ఏడు ఇన్నింగ్స్ లో పూజారా ఏకంగా 1258 బాల్స్ ఎదుర్కొని…ఇండియన్ క్రికెట్ నయావాలా…మజాకానా అనిపించుకొన్నాడు.

కంగారూల పైనే పరుగుల మోత….

ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా గతంలోనే రెండు రెండు డబుల్ సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరిన పూజారా…ప్రస్తుత సిరీస్ లో ఏకంగా మూడు శతకాలు బాదడం మరో విశేషం.

తాను ఎనిమిదేళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ పట్టానని…తన తండ్రి శిక్షణలో సాధన చేయటంతో భయం అనేది లేకుండా పోయిందని… ఏకాగ్రత కూడా బాగా పెరిగిందని… పూజారా చెప్పాడు.

ఏ- గ్రేడ్ టు ఏ+ గ్రేడ్ ప్రమోషన్…

బీసీసీఐ గత సీజన్ కాంట్రాక్టు వరకూ…A- గ్రేడ్ క్రికెటర్ గా ఏడాదికి 5 కోట్ల రూపాయలు అందుకొంటూ వచ్చిన పూజారా… ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్ లో అసాధారణంగా రాణించడం ద్వారా A+ కాంట్రాక్టు అందుకొనే అవకాశాలు మెరుగుపరచుకొన్నాడు.

కేవలం టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్ గా పేరుపొందడంతో…పూజారాకు ఐపీఎల్ కాంట్రాక్టులు ఏమాత్రం దక్కడంలేదు. వేలంలో పూజారా పేరు ఉంచినా… కాంట్రాక్టు ఇవ్వడానికి ఫ్రాంచైజీలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.

దీంతో… టీమిండియా టెస్ట్ జట్టుకు వెన్నెముకగా ఉన్న అరుదైన ఆటగాడు పూజారాకు అండగా నిలవాలని బీసీసీఐ నిర్ణయించింది. అందులో భాగంగానే A+ కాంట్రాక్టుతో …ఏడాదికి 7 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.

అరుదైన, అసాధారణ ఆటగాడు….

మొత్తం మీద…సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకొన్న పూజారాకు….బీసీసీఐ ఎంత నజరానాగా ఇచ్చినా అది తక్కువే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో తక్కువ బంతులు ఎదుర్కొని ఎక్కువ పరుగులు సాధించడం ఎంత ముఖ్యమో….ఐదురోజులపాటు సాగే సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ఎక్కువ బంతులు ఎదుర్కొని…. సమయానుకూలంగా పరుగులు సాధించడం అంతే ప్రధానమని చెప్పాల్సిన పనిలేదు.

ఏదిఏమైనా…రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తర్వాత…ఆ స్థానాన్ని భర్తీ చేయడం ద్వారా సత్తా చాటుకొన్న నయావాల్ చతేశ్వర్ పూజారా….భారత టెస్ట్ క్రికెట్ కు ఆయువుపట్టు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  6 Jan 2019 2:52 AM IST
Next Story