విజయ్ మాల్యాకు బిగ్ షాక్... ప్యూజిటివ్ చట్టం ప్రయోగం...
లిక్కర్ డాన్, ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యాకు షాక్ తగిలింది. దేశ విదేశాల్లో ఉన్న ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ముంబై ప్రత్యేక కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది. ‘ప్యూజిటివ్ ఎనకమిక్ అఫెండర్స్ చట్టం’ కింద విజయ్ మాల్యా ఆట కట్టించింది కోర్టు. కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మాల్యాకు చెందిన దేశ విదేశాల్లోని ఆస్తులను ఈడీ జప్తు చేయనుంది. వాటిని వేలం వేసి ఆ సొమ్మును అప్పుల కింద బ్యాంకులకు జమ చేయనుంది. ప్యూజిటివ్ ఎకనమిక్ […]
లిక్కర్ డాన్, ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యాకు షాక్ తగిలింది. దేశ విదేశాల్లో ఉన్న ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ముంబై ప్రత్యేక కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది. ‘ప్యూజిటివ్ ఎనకమిక్ అఫెండర్స్ చట్టం’ కింద విజయ్ మాల్యా ఆట కట్టించింది కోర్టు.
కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మాల్యాకు చెందిన దేశ విదేశాల్లోని ఆస్తులను ఈడీ జప్తు చేయనుంది. వాటిని వేలం వేసి ఆ సొమ్మును అప్పుల కింద బ్యాంకులకు జమ చేయనుంది. ప్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ చట్టాన్ని గతేడాదే పార్లమెంట్ తీసుకొచ్చింది. ఈ చట్టం కింద బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయే ఆర్థిక నేరస్తుల ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంటుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారి విజయ్ మాల్యా మీదే దాన్ని ప్రయోగించినట్టు అయింది.
విజయ్ మాల్యా వివిధ బ్యాంకులకు 9వేల కోట్లు ఎగ్గొట్టి 2016లో లండన్ పారిపోయాడు. మాల్యాను దేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు చేసిన ప్రయత్నాలు ఇటీవలే ఫలించాయి. మాల్యాను ఇండియాకు అప్పగించేందుకు లండన్ కోర్టు అంగీకరించింది. త్వరలోనే మాల్యాను మన దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉంది.