అందర్నీ ఆశ్చర్యపరిచిన పూరి-రామ్
రామ్ సినిమాలు పక్కనపెడితే పూరి జగన్నాధ్ సినిమాలు మాత్రం ఒకింత ఆశ్చర్యపరుస్తుంటాయి. ఎవరూ ఊహించని టైటిల్స్ పెట్టడం, ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని గెటప్ లో హీరోలను చూపించడం లాంటి పనులు చేస్తుంటాడు పూరి జగన్నాధ్. ఈసారి కూడా అదే పనిచేశాడు. తన కొత్త సినిమాకు ఏకంగా మణిశర్మను తీసుకున్నాడు. ఇప్పుడున్న సంగీత దర్శకుల్లో అందరికంటే సీనియర్ మోస్ట్ సంగీత దర్శకుడు మణిశర్మ మాత్రమే. కానీ అతడికి సీనియారిటీ మాత్రమే ఉంది. క్రేజ్ లేదు. మణిశర్మ హవా […]
రామ్ సినిమాలు పక్కనపెడితే పూరి జగన్నాధ్ సినిమాలు మాత్రం ఒకింత ఆశ్చర్యపరుస్తుంటాయి. ఎవరూ ఊహించని టైటిల్స్ పెట్టడం, ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని గెటప్ లో హీరోలను చూపించడం లాంటి పనులు చేస్తుంటాడు పూరి జగన్నాధ్. ఈసారి కూడా అదే పనిచేశాడు. తన కొత్త సినిమాకు ఏకంగా మణిశర్మను తీసుకున్నాడు.
ఇప్పుడున్న సంగీత దర్శకుల్లో అందరికంటే సీనియర్ మోస్ట్ సంగీత దర్శకుడు మణిశర్మ మాత్రమే. కానీ అతడికి సీనియారిటీ మాత్రమే ఉంది. క్రేజ్ లేదు. మణిశర్మ హవా పోయి దాదాపు దశాబ్దం కావొచ్చింది. అలాంటి మ్యూజిక్ డైరక్టర్ ను ఏరికోరి తన సినిమా కోసం తీసుకున్నాడు పూరి జగన్నాధ్. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.
పూరి జగన్నాధ్-మణిశర్మ కాంబోలో గతంలో చిరుత, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఆ మేజిక్ ను రిపీట్ చేసే ఉద్దేశంతో మణిని రిపీట్ చేశాడని అనుకోవచ్చు. కానీ అప్పట్లో మణిశర్మ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు కాబట్టి నడిచింది. ఇప్పుడు కూడా అదే మణిశర్మను రిపీట్ చేయడంలో అర్థంలేదంటున్నారు చాలామంది.
పూరి తీసుకున్నాడు సరే, ఈ విషయంలో రామ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో అర్థంకాక అతడి ఫ్యాన్స్ తలపట్టుక్కూర్చున్నారు. అయితే పాటల సంగతి పక్కనపెడితే, రీ-రికార్డింగ్ లో మాత్రం మణిశర్మ తోపు. ఈ విషయంలో అతడ్ని శంకించాల్సిన పనిలేదు.