Telugu Global
NEWS

తెలుగువారికి ఆరాధ్యనీయుడైన ఓ కీర్తిశేషుడి బయోపిక్‌కు నో చెప్పా...

ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రం…  బసవతారకం భావాలను ప్రేక్షకులకు అందించే విధంగా ముందుకు సాగుతుందని ఆ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి చెప్పారు. సినిమా అంతా ఆమె దృక్కోణంలోనే సాగుతుందన్నారు. ఎన్టీఆర్‌ మీద చాలా మంది చాలా పుస్తకాలు రాశారని…. ఎవరి కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపిస్తారన్నారు. ఎన్టీఆర్‌పై తాము తీస్తున్నది అచ్చమైన బయోపిక్‌ అని చెప్పారు. మిగిలిన వాళ్లు ఎన్టీఆర్‌పై తీస్తున్నవి బయోపిక్స్‌ అవునో కాదో తనకు తెలియదన్నారు. బయోపిక్స్ విషయంలో వాస్తవానికి దూరంగా వెళ్తే […]

తెలుగువారికి ఆరాధ్యనీయుడైన ఓ కీర్తిశేషుడి బయోపిక్‌కు నో చెప్పా...
X

ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రం… బసవతారకం భావాలను ప్రేక్షకులకు అందించే విధంగా ముందుకు సాగుతుందని ఆ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి చెప్పారు. సినిమా అంతా ఆమె దృక్కోణంలోనే సాగుతుందన్నారు. ఎన్టీఆర్‌ మీద చాలా మంది చాలా పుస్తకాలు రాశారని…. ఎవరి కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపిస్తారన్నారు.

ఎన్టీఆర్‌పై తాము తీస్తున్నది అచ్చమైన బయోపిక్‌ అని చెప్పారు. మిగిలిన వాళ్లు ఎన్టీఆర్‌పై తీస్తున్నవి బయోపిక్స్‌ అవునో కాదో తనకు తెలియదన్నారు. బయోపిక్స్ విషయంలో వాస్తవానికి దూరంగా వెళ్తే ప్రజలు ఆదరించే పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు.

తెలుగువారికి ఆరాధ్యనీయుడైన ఓ కీర్తిశేషుడిపై బయోపిక్ కోసం ఒక దర్శకుడు తనను సంప్రదించారని కీరవాణి వెల్లడించారు. ఆయన మరణాన్ని మీరు సినిమాలో ఎలా చూపిస్తారు? వివాదాస్పదంగానా? లేక దేవుడిలో జ్యోతిగా ఐక్యమయ్యే రీతిలో చూపిస్తారా? అని సదరు దర్శకుడిని తాను అడిగానని వివరించారు.

అందుకు సదరు దర్శకుడు రెండు రకాలుగా కాదు… మూడో రకంగా ఆలోచిస్తున్నా అని చెప్పారని… దాంతో తాను దండం పెట్టేసి చేయనని తేల్చేశానని కీరవాణి వివరించారు.

ఒక ఇంటర్వ్యూలో కీరవాణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తెలుగు వారి ఆరాధ్యుడైన ఆ కీర్తి శేషుడు ఎవరు?. కీరవాణి వద్దకు వచ్చిన సినిమా దర్శకుడు ఎవరు? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

First Published:  5 Jan 2019 5:07 AM IST
Next Story