సంతానోత్పత్తిని దూరం చేస్తున్న సెల్ ఫోన్
టెలికాం రంగంలో విపరీతమైన పోటీవల్ల సెల్ ఫోన్ ప్రమాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు టెలికాం రంగానికి చెందిన జియో, ఐడియా, ఎయిర్ టెల్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో సెల్ ఫోన్ వినియోగదారులు ఆఫర్లను సొంతం చేసుకొని సోషల్ మీడియాలో నిర్విరామంగా కొన్ని గంటలపాటు గడిపేస్తున్నారు. తద్వారా సెల్ ఫోన్లు వేడెక్కి పేలడం, పలువురు చనిపోవడం, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే సెల్ ఫోన్ లు పేలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా ఉంటాయని […]
టెలికాం రంగంలో విపరీతమైన పోటీవల్ల సెల్ ఫోన్ ప్రమాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు టెలికాం రంగానికి చెందిన జియో, ఐడియా, ఎయిర్ టెల్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
దీంతో సెల్ ఫోన్ వినియోగదారులు ఆఫర్లను సొంతం చేసుకొని సోషల్ మీడియాలో నిర్విరామంగా కొన్ని గంటలపాటు గడిపేస్తున్నారు. తద్వారా సెల్ ఫోన్లు వేడెక్కి పేలడం, పలువురు చనిపోవడం, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే సెల్ ఫోన్ లు పేలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్ ను ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదు. అలా మాట్లాడడం వల్లే సెల్ ఫోన్ కు ప్రసారమయ్యే కరెంట్ లో హెచ్చు తగ్గులుంటాయి. మనం మాట్లాడే సమయంలో ఒక్కసారిగా కరెంట్ ఉత్పత్తి పెరిగినప్పుడు సెల్ ఫోన్ పై ఒత్తిడి పెరిగి, హీటెక్కి పేలుతాయి.
చాలామంది రాత్రి పడుకునే సమయంలో దిండుకింద సెల్ ఫోన్ పెట్టి పడుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల సెల్ ఫోన్ నుండి ఉత్పత్తి అయ్యే రేడియో తరంగాలు మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే సెల్ ఫోన్ ను దూరంగా పెట్టుకొని నిద్రించడం ఉత్తమం.
నేటి కంప్యూటర్ యుగంలో చాలా మందికి పిల్లలు పుట్టడం అనేది చాలా సమస్యగా మారింది. దానికి కారణం సెల్ ఫోన్ వినియోగమని చెబుతున్నారు. సెల్ ఫోన్ ను చాలా మంది చొక్కా జేబులో, ప్యాంట్ జేబుల్లో పెట్టుకుంటుంటారు. అలా వినియోగించడం చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్యాంట్ జేబులో, చొక్కా జేబులో సెల్ ఫోన్ పెట్టుకోవడం వల్ల వాటి నుంచి ఉత్పత్తి అయ్యే రేడియేషన్ శరీరంలోకి చొచ్చుకొని, కణాల్ని దెబ్బ తీస్తుందని, దీంతో సంతానోత్పతికి అవరోధం ఏర్పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. సెల్ ఫోన్ ను చేతిలో పెట్టుకొని వినియోగించుకోవడం ఉత్తమమని అంటున్నారు.